అదిలాబాద్

గిరిజన గ్రామాలన్నింటికీ రోడ్డు సౌకర్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉట్నూరు, జూలై 31: రాబోయే మూడేళ్లలో గిరిజన గ్రామాలన్నింటికీ రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నట్లు గిరిజన సంక్షేమ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆజ్మీర చందులాల్ నాయక్ పేర్కొన్నారు. ఆదివారం కొమరంభీం ప్రాంగణంలోని పిఎమ్మార్సీ సమావేశ మందిరంలో ఐటిడిఏ పాలకవర్గ సమావేశానికి వచ్చిన సందర్భంగా మంత్రి చందులాల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమంపై ప్రత్యేక దృష్టిసారించిందన్నారు. అందుకుగాను బడ్జెట్‌లో 6,170 కోట్ల నిధులు కేటాయించిందన్నారు. గిరిజన గ్రామాలు అభివృద్ధి చెందాలంటే రోడ్ల సౌకర్యం ముఖ్యమని భావించిన సిఎం రోడ్డు సౌకర్యంలేని 2331గిరిజన గ్రామాలకు రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. జిల్లాలోని 10యోజకవర్గాలో ఆదిలాబాద్‌కు 520 కోట్లు, ఆసిఫాబాద్‌కు 19 కోట్లు, బోథ్‌కు 12కోట్ల 25లక్షలు, సిర్పూర్‌టికి 7కోట్లు, బెల్లంపెల్లికి 4కోట్ల 67 లక్షలు, చెన్నూర్‌కు రూ.3కోట్ల 6 లక్షలు, మంచిర్యాలకు కోటి 37లక్షలు, ఖానాపూర్ నియోజకవర్గానికి 13కోట్ల 51లక్ష, ముథోల్‌కు 3కోట్ల 6లక్షలు, నిర్మల్ నియోజకవర్గానికి 3కోట్ల 69 లక్షల మంజురు చేయడం జరిగిందన్నా రు. అటవీ శాఖ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు కోచింగ్ సెంటర్ల ద్వారా 180మంది గిరిజన నిరుద్యోగులకు యుపిఎస్‌సి పరీక్షలకు సంబంధించి శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యబోధన అందించేందుకు నూతనం గా 51ఆశ్రమ పాఠశాలలు మంజూరు చేయగా జిల్లాలో 6 గురుకుల ఆశ్రమ పాఠశాలలు మంజూరు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో మహిళలకు వర్కింగ్ హుమెన్ హాస్టల్‌తో పాటు జైనూర్, లక్కంపూర్, కెస్లాపూర్ బాలికల ఆశ్రమ పాఠశాలలను ఆశ్రమ జూనియర్ కళాశాలలుగా మార్పుచేస్తున్నామన్నారు. అనంతరం రూ.5కోట్ల 50 లక్షల నిధులతో ఆదిలాబాద్, ఉట్నూరు, ఆసిఫాబాద్, ఖానాపూర్, బోథ్ మండల కేంద్రాల్లో గిరిజన భవనాల నిర్మాణం, రూ.25కోట్ల25లక్షలతో జైనూర్, ఇంద్రవెల్లి, బోథ్, సిర్పూర్‌టి, ముథోల్‌లలో నిర్మించనున్న గిరిజన పాఠశాలల భవనాలు, రూ.45కోట్ల 3లక్షలతో ఎందా, కల్వాడా, బాబాపూర్, కోహినూర్, బజార్ హత్నూర్, బీమారంలో ఆశ్రమ పాఠశాలల డార్మెంటరి, అదనపు గదుల నిర్మాణం, రూ.2కోట్ల 75 లక్షలతో ఆదిలాబాద్‌లో వర్కింగ్ హుమెన్స్ హాస్టల్, కోటి 90 లక్షలతో ఖానాపూర్, లక్సిటిపేట్‌లో బాలికల ఆశ్రమ పాఠశాలల్లో అదనపు వౌలిక సదుపాయాల పనుల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. కార్యక్రమంలో ఎంపి గెడం నగేష్‌తో పాటు జిల్లాలోని ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.