అదిలాబాద్

ఉత్తమ ఫోటో, వీడియో గ్రాఫర్లకు అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 11: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని ఫ్రెండ్లీ పోలీసింగ్‌పై ఫోటోగ్రఫి, షార్ట్ఫిల్మ్ పోటీలను నిర్వహిస్తున్నట్లు, ఎంపికైనా ఉత్తమ ఫోటో, వీడియోగ్రాఫర్లకు అవార్డులు ప్రదానం చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ అన్నారు. గురువారం స్థానిక పోలీసు కార్యాలయం నుండి టెలీకాన్ఫరెన్స్ ద్వారా జిల్లా పోలీసు అధికారులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం, గ్రామజ్యోతి, జనమైత్రి, రోడ్డు ప్రమాదాల నివారణ వంటి కార్యక్రమాల్లో పాల్గొన్న పోలీసులు ప్రజలకు మద్య స్నేహసంబంధాలను పెంపొందించే అంశాలపై చిత్రీకరించిన ఫోటోలు, షార్ట్‌పిల్మ్‌లను స్వీకరించడం జరుగుతుందని అన్నారు. జిల్లాలోని ఔత్సాహిక ఫోటో, వీడియో గ్రాఫర్లు నగదు బహుమతి పొందేందుకు ఈనెల 20వ తేదీలోపు ఫోటోలను, వీడియోలను పంపించాలని అన్నారు. ఫోటోగ్రఫిలో పాల్గొనేవారు మూడు ఫోటోలకు మించకుండా సిడి సాప్ట్‌కాపిని పంపాలని అన్నారు. అదే విధంగా వీడియోగ్రాఫర్లు 10 నిమిషాల వ్యవధికల్గిన పోలీసుల ఇమేజ్‌ను పెంచే విధంగా తీసిన వీడియోను అందజేయాలని సూచించారు. పూర్తి వివరాలకు జిల్లా పోలీసు పి ఆర్‌వో సెల్ నెంబర్ 9440900673ను సంప్రదించాలని అన్నారు. ఈ ఏడాది మొదటిసారిగా పాత్రికేయుల విభాగంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ప్రత్యేకంగా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. న్యాయ నిర్ణేతలుగాజిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా ఎస్పీతో పాటు జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి, సీనియర్ పాత్రికేయుడు, రాజకీయ పార్టీలకు అతీతంగా ఉండే ప్రముఖ వ్యక్తి, జిల్లా పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు విజేతలను ఎంపికచేస్తారని అన్నారు. జిల్లా స్థాయిలో ఎంపిక వారికి బహుమతులు ప్రదానం చేయడంతో పాటు రాష్టస్థ్రాయి పోటీలకు పంపించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్‌పెక్టర్ బి.ప్రవీణ్, ఎస్సైలు యంఏ కరీం, అన్వర్ ఉల్ హఖ్, శ్యాంసుందర్ రెడ్డి, రామన్న తదితరులు పాల్గొన్నారు.