అదిలాబాద్

వసతిగృహా విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తలమడుగు, ఆగస్టు 19: ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థులకు మెను ప్రకారం భోజనం అందించాలని తహశీల్దార్ రాయిసిడాం చిత్రు అన్నారు. శుక్రవారం మండలంలోని ఝరిపూనగూడ ఆశ్రమ బాలుర పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులకు అందించే భోజనం పౌష్టికాహారంతో కూడినట్లుగా లేదని వసతి గృహం నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇంట్లో పిల్లలకు ఇలాగే పెడుతారా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా తీరుమార్చుకొని విద్యార్థులకు మెను ప్రకారం పౌష్టికాహారంతో కూడిన భోజనం అందించాలని, లేనట్లయితే చర్యలు తప్పవని హెచ్చరించారు. వసతి గృహానికి సంబంధించిన రిజిస్టర్లను పరిశీలించారు. విద్యార్థులకు అందించే అరటిపండ్లు కుళ్లిపోయినట్లుగా ఉండడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలల్లో విధులు నిర్వర్తించే ఇద్దరు ఉపాధ్యాయులు ఎలాంటి సెలవు పత్రం ఇవ్వకుండానే విధులకు గైర్హాజరు కావడంపై ప్రధానోపాధ్యాయున్ని వివరణ కోరగా ఉపాధ్యాయుల్దిరు తనకు చెప్పి వెళ్లారని సమాధానం ఇవ్వడంపై తహసీల్దార్ మండిపడ్డారు. ఇకనైనా తమ తీరుమార్చుకోవాలని, లేకపోతే ఐటిడిఏ పివోకు ఫిర్యాదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. తహసీల్దార్ వెంట ఎంపిడీవో సునీత, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఉన్నారు.