అదిలాబాద్

ప్రజావాణిలో సమస్యల వెల్లువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, ఆగస్టు 29: మంచిర్యాల ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో డివిజన్‌లోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యలను ఆర్డీవో ఆయిషా మస్రత్ ఖానంకు విన్నవించారు. ఈ ప్రజావాణిలో బాధితులు అర్జీలను అందజేశారు. శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన సంద్య అనారోగ్యంతో బాధపడుతోందని చికిత్స చేయించడం కొరకు ఆర్డీవోకు దరఖాస్తు చేసుకోగా, వెంటనే స్పందించి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య చికిత్సలు అందించడానికి సంబంధిత అధికారులకు ఆర్డీవో ఆదేశాలు జారీ చేసింది. క్యాతన్‌పల్లికి చెందిన వికలాంగురాలు కరుణ తనకు ఫించన్ రావడం లేదని, ఫించన్ ఇప్పించాలని కోరగా, పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మందమర్రి మండలం ఎర్రగుంటపల్లికి చెందిన ఓపెన్ కాస్టు భూ నిర్వాసితులకు నష్టపరిహారం అందేలా న్యాయం చేయాలని కోరగా, తహసిల్దార్ ద్వారా విచారణ జరిపించి న్యాయం చేస్తామని తెలిపారు. అదేవిధంగా ఎల్లంపల్లి, శ్రీరాంపూర్ ఓసిపిల్లో భూములు కోల్పోయినవారికి పరిహారంతో పాటు ఇండ్ల నిర్మాణ స్థలాలను ఇప్పించాలని అర్జీలు అందజేశారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని వివిధ విద్యార్థి సంఘాల నాయకులు ఆర్డీవోకు అందజేశారు.

*