అదిలాబాద్

టీచర్లు ఆదర్శంగా పనిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉట్నూరు, సెప్టెంబర్ 8: ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఆదర్శవంతంగా విధులు నిర్వర్తిస్తూ గిరిజన విద్యార్థులను బావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని ఐటిడి ఏ ప్రాజెక్టు అధికారి ఆర్‌వి కర్ణన్ అన్నారు. గురువారం కొమరంభీం ప్రాంగణంలోని పిఎమ్మార్సీ భవనంలో గిరిజన సంక్షేమ శాఖ అధ్వర్యంలో గురు పూజోత్సవ కార్యక్రమం నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తూ ప్రతి ఒక్కరికి జవాబుదారిగా ఉండాలని అన్నారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించే విధంగా సన్మార్గంలో ఉన్నతమైన విద్యను అందించాలన్నారు. గతంలో ఫలితాలు తక్కువ వచ్చినా ఈ ఏడాది చాలా మెరుగ్గా ఉన్నాయని, ఇదే బాటలో నడుస్తూ ముందుకు వెళ్లాలని అన్నారు. అనంతరం పలువురు ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డిడి రాంమూర్తి, ఈఈ రమేష్‌లు పాల్గొన్నారు.