అదిలాబాద్

పునర్విభజన వల్ల ప్రజలకు ఒరిగేదేమి లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, సెప్టెంబర్ 9: జిల్లాల పునర్విభజన వల్ల ప్రజలకు ఒరిగేదేమిలేదని, ఆదిలాబాద్ జిల్లాను మూడు ముక్కలు చేయడం శోచనీయమని తెలంగాణ తొలిదశ ఉద్యమకారులు విమర్శించారు. శుక్రవారం నిర్మల్ జిల్లా ఖరారును వ్యతిరేకిస్తూ ఆదిలాబాద్ సంరక్షణ సమితి అధ్వర్యంలో 13 రోజులుగా కొనసాగుతున్న రిలే దీక్షల్లో 1969లో జైతెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు నల్ల బ్యాడ్జీలు, కండువాలతో దీక్షలు కొనసాగించారు. బిసి సంఘం జిల్లా అధ్యక్షుడు ఈర్ల సత్యం, కో కన్వీనర్ జగదీష్ అగర్వాల్ దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలి తెలంగాణ ఉద్యమకారుల సంఘం అధ్యక్షులు మోర విఠల్, కార్యదర్శి ఈశ్వర్‌సింగ్ మాట్లాడుతూ సమైక్యాంధ్రను విబజించాలని 1969లో ఉద్యమాలు చేసి తాము జైలుకెళ్తే, వెనకబడ్డ ఆదిలాబాద్ జిల్లా పరిరక్షణ కోసం అందోళన చేయడం తమకు సిగ్గుచేటుగా ఉందన్నారు. 15 మండలాలతో కూడిన ఆదిలాబాద్ జిల్లాను మూడవ జిల్లాగా గుర్తించడం శోచనీయమని, రాజకీయ ప్రయోజనాల కోసమే నిర్మల్ జిల్లాను తెరపైకి తెచ్చారని వారు విమర్శించారు. ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలు మాత్రమే ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఈ అందోళనకు విద్యార్థులు, బిసి యువజన సంఘాల సభ్యులు సంఘీభావం ప్రకటించారు. శుక్రవారం దీక్షల్లో పాల్గొన్న వారిలో మోర విఠ్ఠల్, గందెకృష్ణకుమార్, ఆర్.రమేష్, గోపినాథ్ గౌడ్, ప్రకాష్ గౌడ్, వెంకట్రావు, మురళిధర్ అహుజ, శరత్‌చంద్ర, ఈశ్వర్‌సింగ్ పాల్గొన్నారు.