అదిలాబాద్

బొందలగడ్డగా మార్చేందుకు కెసిఆర్ కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెల్లంపల్లి, సెప్టెంబర్ 22: తూర్పు జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు కేంద్ర బింధువుగా ఉన్న బెల్లంపల్లిని ముఖ్యమంత్రి కెసిఆర్ బొందలగడ్డగా మార్చేందుకు కుట్ర పన్నుతున్నారని, మంచిర్యాల జిల్లా ఎవరి కోసమో ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టం చేయాలని జిల్లా సాధన అఖిలపక్ష కమిటీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్, జడ్పీటీసీ రాంచందర్, బొల్లెడ కేశవ రెడ్డి, ముర్కూరి చంద్రయ్య డిమాండ్ చేశారు. గురువారం బెల్లంపల్లి పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రంలో కొత్త జిల్లాల చిచ్చుపెట్టి ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. బెల్లంపల్లిని జిల్లా చేయాలని అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు జరుగుతున్నా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. బెల్లంపల్లి జిల్లా కోసం రాస్తారోకోలు, ధర్నాలు, 48గంటల బంద్, మెమోరండాలు, జాతీయ రహదారుల దిగ్బందం, జిల్లా కార్యాలయాల ఎదుట ధర్నాలు, అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన ముఖ్యమంత్రికి దున్నపోతు మీద వాన పడిన చందంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు కోరుకోని నిర్మల్, పెద్దపెల్లి జిల్లాలను ప్రకటించి బెల్లంపల్లి ప్రజలకు తీరని ద్రోహం చేశారని విమర్శించారు. ఆసిఫాబాద్‌లో 49308మంది గిరిజనులు బెల్లంపల్లిలో 21506, సిర్పూర్‌లో 32736 మంది గిరిజనులు ఉన్నారని తెలిపారు. 11వేల మంది గిరిజనులు ఉన్న మంచిర్యాలకు కొమురంభీం జిల్లా అని పేరు పెట్టి గిరిజనుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. లక్ష గిరిజన జనాభా ఉన్న ఈ నియోజకవర్గాలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా బెల్లంపల్లిని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ జిల్లాల ప్రకటన తీరు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్న చందంగా ఉందన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, భూస్వాములు, రాజకీయ నాయకులకు కాసులు కురిపించేందుకే మంచిర్యాలను జిల్లాగా ప్రకటించి దళితులకు తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు కెసిఆర్ అనేక హామీలు ఇచ్చి రాష్ట్రం ఏర్పడ్డాక ఆ హామీలను అమలుపర్చడంలేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీ ఆర్ చరిత్ర హీనుడుగా మిగిలిపోతారన్నారు. బెల్లంపల్లి జిల్లాపై అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ఎందుకు వౌనం వహిస్తున్నారో ప్రజలకు సమాదానం చెప్పాలన్నారు. అధికార పార్టీకి ఎంపి, ఎమ్మెల్యేలు బానిసలుగా పనిచేస్తూ మంచిర్యాల జిల్లాకు మద్దతివ్వడం గర్హణీయమన్నారు. బెల్లంపల్లిని కాపాడుకోవాలంటే బెల్లంపల్లిని జిల్లాగా ప్రకటించాలని, అందుకు మేధావులు, రాజకీయ పార్టీల నాయకులు, వ్యాపారస్తులు, విద్యార్థులు ప్రతీ ఒక్కరు బెల్లంపల్లి జిల్లా సాధన ఉద్యమంలో పాల్గొని బెల్లంపల్లి జిల్లా సాధించాలని తెలిపారు. బెల్లంపల్లి జిల్లా కోసం అఖిల పక్ష సాధన కమిటీ ఆధ్వర్యంలో అతి త్వరలో మలిదశ ఉద్యమం చేపడుతున్నట్లు తెలిపారు. అంతే కాకుండా హై కోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ చేపట్టాలని మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు నాయకులు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా సాధన సమితి కమిటీ నాయకులు శ్రీదర్, సోగాల శ్రీనివాస్, రాయమల్లు, కత్తెరసాల పోశం, బండి ప్రభాకర్, రాజ్‌కుమార్ పాండే, కోయల్‌కార్ గోవర్దన్, కొలిపాక శ్రీనివాస్, మంతెన మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.