ఎలావుందీ వారం?

ఎలా వుందీ వారం? (ఏప్రిల్ 16 నుండి 22 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

ఆర్థిక ఉన్నతి ఉంది. అవకాశాలను సావకాశాలుగా వినియోగించుకుంటే పనులు సజావుగా సాగుతాయి. ఆశయం సిద్ధిస్తుంది. కార్యాలకు మిత్రులు సహకరిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కనున్నాయి. ఉన్నవి మంచి రోజులు అన్న భావనతో మెలగాలి. స్ర్తిలు సమిష్టిగా అనుకున్నవి సాధిస్తారు. ఉద్యోగావకాశాలు వృద్ధి. అన్ని రంగాల వారికి అభివృద్ధి. పరిచయాలు ఉపకరిస్తాయి. స్పెక్యులేషన్‌లో లాభం. గోప్యత అవశ్యం. ఆలస్యంగా పనులు జరుగుతున్నప్పటికీ ఆందోళన పడకండి.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)
ఆదాయ వ్యయాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలు గతంకన్నా బాగుంటాయి. ఆరోగ్యం జాగ్రత్త. బంధుమిత్రులు అన్నింటా సాయపడతారు. శుభకార్యాలు మీ ప్రమేయంతో ముందుకు సాగుతాయి. అప్పులు తీర్చగలుగుతారు. కోర్టు వ్యవహారాలు, ఉద్యోగ రంగంలో వృద్ధి. వ్యాపార విస్తరణ. కానిచోట అధికుల మనకండి. సమస్యలు మీ చాకచక్యంతో పరిష్కరించుకొంటారు. స్పెక్యులేషన్ ఆలోచనాత్మకంగా ఉపకరిస్తుంది. ప్రయాణాల్లో మెళకువలు పాటించండి.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

ఇబ్బందికరమైన వాటి నుంచి చాకచక్యంగా బయటపడతారు. స్ర్తిలకు ఉద్యోగావకాశాలు. ఇతరుల విషయాల్లో మీ ప్రమేయం తగ్గించుకోవాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు గతం కంటె శుభ ఫలితాల నిస్తాయి. అన్నింటా సమిష్టి వాతావరణమే మేలు అని భావిస్తారు. ప్రయాణాదులు, రియల్ ఎస్టేట్ రంగం సంతోషాన్నిస్తాయి. స్పెక్యులేషన్‌లో శుభ ఫలితాలు. ఉద్యోగ వ్యవహారాలు సత్ఫలితాలను అందిస్తాయి. దూరపు వారు దగ్గరవుతారు.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)
ఆరోగ్య మెళకువలు పాటించాలి. వాతావరణానికి అనుకూలంగా వర్తించాలి. మీరు ఎంచుకున్న రంగాల్లో ముందుకు దూసుకెళతారు. ఆర్థిక వనరులు సమయానికి అందుతాయి. దంపతులు మెరుగైన జీవితాన్ని అందిపుచ్చుకుంటారు. స్పెక్యులేషన్, పెట్టుబడులు వృద్ధి. మీరు ఎంచుకున్న వృత్తి, వ్యాపార, వ్యవహార ఉద్యోగ రంగాలు పోటీకి అనుకూలంగా ఉంటుంది. తృప్తితోనే సంతృప్తి అని గ్రహిస్తారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)

మీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్ర్తి సహకారంతో అన్నీ సుగమం. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు సంతోషదాయకం. స్పెక్యులేషన్‌లో మిశ్రమాలు. విశ్రాంతి తీసుకుంటూ, ఇష్టుల సాయంతో అన్నీ శుభాలే. శుభవార్త, ఆర్థిక లాభాలు సంతోషాన్ని విస్తరింపజేస్తాయి. పోటీదారులు మంచి భవిష్యత్తును వీక్షిస్తారు. ఉద్యోగ వ్యవహారాలు సత్ఫలితాలను అందిస్తాయి. దూరపు వారు దగ్గరవుతారు. విరోధ భావాలు వద్దు.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)

అందరి సహాయ సహకారాల్తో మీ పనులు సాగుతాయి. కుటుంబ సభ్యుల సాయం అందుతుంది. ఆరోగ్యానికై మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలు ఆలోచింపజేస్తాయి. అన్నింటా విస్తరణ, ప్రయోజనాలుంటాయి. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. సమిష్టి కృషి మేలు. ఆలోచనలు ఫలప్రదం. స్పెక్యులేషన్ మిశ్రమం.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)

మీ కార్యాలకు స్పందన లభిస్తుంది. అనుకున్నది ఆలస్యంగానైనా సాధిస్తారు. స్పెక్యులేషన్‌లో ఆహ్లాదకర వాతావరణం. దంపతులు సరైన ఆలోచనలతో వ్యవహరించాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు గతంలాగే వున్నా విస్తరణకు మంచి సమయం. కోపతాపాలు, వివాదాల జోలికి వెళ్లకండి. గిల్లికజ్జాలకు దూరం పాటించాలి. మిత్రుల సాయం సమయానికి అందుతుంది. విద్య, వైద్య రంగాలు మెరుగుపడతాయి. నిదానమే ప్రధానం. ఒత్తిడి వద్దు.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)

ఎంచుకున్న రంగాల్లో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగావకాశాలు ఆశించిన వారికి సమకూరుతాయి. ఆస్తి విషయాలందు ఆలోచన మేలు. కుటుంబ సభ్యుల సహకారం క్రమం తప్పకుండా అందుకుంటారు. మీ శ్రమకు గుర్తింపు, వర్తింపు. కంటి, పంటి నొప్పులకు ఔషధ సేవనం మంచిది. స్పెక్యులేషన్‌లో దీర్ఘకాల ప్రయోజనాలు. అనుకోకుండా ఆర్థిక అభివృద్ధి. ఇతరులను కనిపెడుతూ ఉండాలి. హడావిడితనం వద్దు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)

మీరు అనుకున్నవి అందుకుంటారు. ఆర్థిక అభివృద్ధి. స్ర్తి, దంపతుల సాయంతో పనులు త్వరగా పూర్తి చేస్తారు. మీ ప్రమేయంతో కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, సంఘ కార్యాలు అందరినీ ఆకర్షితులను చేస్తాయి. అన్ని లావాదేవీలు ప్రయోజనాత్మకం. భేదం వద్దు. బంధాలు వృద్ధి. తృప్తితోనే సంతృప్తి అని గ్రహిస్తారు. స్పెక్యులేషన్‌లో శుభ ఫలితాలు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)

కష్టానికి తగిన గుర్తింపు ఉంటుంది. ఆర్థిక ప్రగతి ప్రయోజనకరం. చేతనైన ఉపకారాలు క్రమం తప్పకుండా చేయండి. చేపట్టే వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు ఆర్థిక శక్తికి అనుకూలం. విదేశీ ప్రయత్నాలు, విద్య, వైద్య రంగాలలు గతం కంటే మెరుగు. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. స్ర్తిలకు అన్నింటా పోటీ ఉండవచ్చు. ఆరోగ్యం జాగ్రత్త.

కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)
ఆర్థిక ప్రగతి వున్నా ఆందోళన తగ్గించుకోండి. ఆస్తి విషయాలందు తగాదాలు లేకుండా పరిష్కరించుకోండి. దంపతులు అనుకున్నవి సాధిస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు ప్రభావితం చేస్తాయి. ద్వేషభావాలు వద్దు. దూరపు బంధువులు దగ్గరవుతారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కలవరపెట్టనుంది. పరిశీలనాత్మకత అన్నింటా మంచిది. పెట్టుబడులు లాభిస్తాయి. పత్రాలు, వస్తువుల కొనుగోలు మేలు. నిరుద్యోగులకు మంచి సమయం.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆలోచనలతో కార్యాలు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, వ్యవహారాదులు గుర్తింపును తెచ్చిపెడతాయి. ఇష్టపడే పనులతో ముందుకు వెళ్లండి. సంతోషంగా కాలాన్ని గడుపుతారు. ఆచార వ్యవహారాలకు ప్రాధాన్యత ఇవ్వండి. అన్యోన్యతతో వ్యతిరేక భావాలు దూరం చేసుకోండి. స్పెక్యులేషన్ ఫలప్రదం. ఆరోగ్యానికి వ్యాయామం, విరామం మంచిది.

ఎ.సి.ఎం. వత్సల్, 93911 37855