30న గోపీచంద్ ‘ఆక్సిజన్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపీచంద్, రాశీఖన్నా, అను ఇమ్మాన్యుయేల్ హీరో హీరోయిన్లుగా ఎ.ఎం జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆక్సిజన్’. శ్రీ సాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తోన్న ఈ చిత్రంలో జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఐశ్వర్య మాట్లాడుతూ- ‘గోపీచంద్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రమిది. నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీపడలేదు. ఈ చిత్రానికి యువన్ శంకర్‌రాజా స్వరపరచిన పాటలు తెలుగు ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తాయి. దర్శకుడు జ్యోతికృష్ణ ఈ చిత్రాన్ని చక్కగా తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం పాటలు, ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రాన్ని కూడా అదే స్థాయిలో ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకం వుంది’ అని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.