తూర్పుగోదావరి

అంగన్‌వాడీ కార్యకర్తల నిర్బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోకవరం, డిసెంబర్ 18: తమ వేతనాలు పెంచుతూ ముఖ్యమంత్రి వెంటనే జిఒ జారీ చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం విజయవాడలో నిర్వహిస్తున్న ఆందోళనకు తరలివెడుతున్న అంగన్‌వాడీ కార్యకర్తలను ఇక్కడ పోలీసులు నిర్బంధించారు. రంపచోడవరం, దేవీపట్నం మండలాలకు చెందిన పలువురు అంగన్‌వాడీలు విజయవాడ వెడుతుండగా గోకవరం ఎస్సై ఆర్ శివాజీ సిబ్బందితో కలిసి ఆర్టీసీ బస్టాండులో ఉన్న సుమారు 15 మంది అంగన్‌వాడీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని స్టేషనులో నిర్బంధించారు. దీనిపై అంగన్‌వాడీ నాయకులు బి రామలక్ష్మి, కెవివి లక్ష్మి, ఎస్ నాగకుమారి, ఎం లక్ష్మి తదితరులు మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చిన హామీని జిఒ రూపంలో ఇవ్వాలని కోరేందుకు విజయవాడ వెడుతుండగా తమను అన్యాయంగా నిర్బంధించారని ఆరోపించారు.