అంతర్జాతీయం

అట్టుడుకుతున్న తమిళనాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈరోడ్, ఏప్రిల్ 12: కావేరీ నదీజలాల సమస్యను పరిష్కరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు ఏవిధమైన చర్యలు తీసుకోవడంలేదంటూ, గురువారం తమిళనాడులోని ఈరోడ్‌లో 25 ఏళ్ల యువకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మాహుతి యత్నానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ధర్మలింగం అనే యువకుడు ఒంటికి నిప్పంటించుకోవడంతో 90శాతం గాయపడ్డాడు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం అతని పరిస్థితి క్లిష్టంగా ఉన్నదని ఆసుపత్రి వర్గా లు తెలిపాయి. డిఫెన్స్ ఎక్స్‌పోలో పాల్గొనేందుకు ప్రధాని రాకను నిరసిస్తూ ఆ యువకుడు తన ఇం టి గోడపై ఒక సందేశం రాసినట్టు పోలీసులు తె లిపారు. ‘తమిళనాడుకు కావేరీ జలాలు జీవనాడి. అయినప్పటికీ ముఖ్యమంత్రి పళనిస్వామి, ప్రధాని నరేంద్ర మోదీ, కావేరీ నదీజలాల యాజమాన్య బోర్డును నియమించడానికి ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో మోదీ తమిళనాడు రాకను వ్యతిరేకిస్తున్నా’ అంటూ ఆ సందేశంలో పేర్కొన్నాడు.
నిరసన ప్రదర్శనలు
కావేరీ జలాల సమస్యపై, తమిళనాడు అట్టుడుకుతోంది. గురువారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చోటుచేసుకున్నాయి. వివిధ రాజకీయ పార్టీలు, తమిళ అనుకూల సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థి సంఘాలు, ‘కావేరీ నదీజలాల యాజమాన్య బోర్డును’ ఏర్పాటు చేయాలంటూ ఈ నెల 1నుంచి తీవ్రస్థాయిలో ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఫిబ్రవరి 16న కావేరీ జలాలపై సుప్రీంకోర్టు, కర్ణాటకకు 270 టీఎంసీఎఫ్‌టీ నీటిని కేటాయించడమే కాకుండా, తమిళనాడు వాటాలో 14.75 టీఎంసీఎఫ్‌టీ కోత విధిస్తూ తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో తమిళనాడు కావేరీ బేసిన్‌లో 10 టీఎంసీఫ్‌టీల భూగర్భజలాలను వాడుకోవడానకి కోర్టు అనుమతించింది. దీని అమలుకు ఒక ఫార్ములాను రూపొందించేందుకు కేంద్రానికి ఆరువారాల గడువిచ్చింది. మార్చి 29తో ఆ గడువు ముగిసింది.