అంతర్జాతీయం

వైషమ్యాలు విడిచి... శాంతి బాటలో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోయాంగ్ (దక్షిణ కొరియా), ఏప్రిల్ 27: రెండు కొరియాల మధ్య 65 ఏళ్లుగా కొనసాగుతున్న వైషమ్యాలకు తెరపడి, సత్సంబంధాలతో కూడిన నవశకం ఆరంభమైంది. రెండు దేశాల అధినేతల మధ్య శుక్రవారం జరిగిన చారిత్రాత్మక శిఖరాగ్ర చర్చల్లో శాశ్వత శాంతి ఒప్పందం కుదరడం నిజంగా అద్భుతమే. విడిపోయిన కొరియా ద్వీపకల్పాన్ని సంపూర్ణ అణ్వస్త్ర రహితం చేయడంపై కూడా ఇద్దరు నేతలు అంగీకరించారు. ‘పన్‌ముంజోమ్ డిక్లరేషన్’గా పిలుస్తున్న ఈ ఒప్పందంపై ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్‌లు సంతకాలు చేసిన అనంతరం పరస్పరం ఆలింగనం చేసుకున్నారు. అంతకుముందు రెండు దేశాలను విభజిస్తున్న సరిహద్దు రేఖవద్ద ఇద్దరు నేతలు పరస్పరం షేక్‌హ్యాండ్ ఇచ్చుకున్న సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. ‘‘ సంపూర్ణ అణ్వస్తర్రహిత కొరియా ద్వీపకల్పం తమ ఉమ్మడి లక్ష్యమంటూ’’ ఇద్దరు నేతలు ప్రకటించారు. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న సంఘర్షణలకు ఈ ఏడాదితో స్వస్తిపలకాలని నిర్ణయించారు. ఆవిధంగా 65 ఏళ్లుగా రెండు దేశాల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితులకు, యుద్ధం ద్వారా కాకుండా శాంతి చర్చల ద్వారా పరిష్కారం లభించడం నిజంగా విశేషమే. రెండు దేశాధినేతలు నిత్యం చర్చలు జరుపడానికి, టెలిఫోన్‌లో సంభాషించడానికి కూడా అంగీకరించారు. రెండు దేశాల మధ్య ఈవిధంగా శాంతి ఒప్పందం కుదరడం నిజంగామంచి పరిణామమైనప్పటికీ, కిమ్ అణ్వస్త్ర రహితంపై మరింత స్పష్టంగా పేర్కొనకపోవడం ఇక్కడ గమనార్హమని విశే్లషకులు పేర్కొంటున్నారు. గతంలో కూడా ఉత్తర కొరియా అధినేత అనేక వాగ్దానాలు చేసినప్పటికీ వాటిల్లో చాలావరకు ఇంకా పూర్తి చేయలేదన్న అంశాన్ని వారు గుర్తు చేస్తున్నారు. కాగా కొద్ది వారాల్లో కిమ్ జోంగ్ ఉన్, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో సమావేశం కానున్నారు. ఇదిలావుండగా ఈ ఏడాది యుఎస్, చైనాలతో సమావేశం కావాలన్న కాంక్షను రెండు దేశాలు వ్యక్తం చేశాయి. మొత్తం కొరియా ద్వీపకల్పంపై ఉభయ కొరియా దేశాల సార్వభౌమత్యమే కొనసాగుతుంది. ఈ ఒప్పందంతో ఘర్షణలు సమసిపోయి ఇక శాంతి యుగం ప్రారంభమవుతుందని స్పష్టం చేశాయి. అయితే అణ్వస్త్రాలను ఎంతటి స్థాయిలో తొలగించాలన్నదానిపై ఇంకా స్పష్టత ఏర్పడలేదు. ఉత్తర కొరియా తన అణ్వస్త్రాలను పూర్తిగా వదిలేయాలన్నది ట్రంప్ ప్రధాన డిమాండ్. ఉభయ కొరియాల సమావేశాన్ని ట్రంప్ ప్రశంసించినప్పటికీ ‘కాలమే దీని పర్యవసానాన్ని తెలుపుతుంది’ అని హెచ్చరించారు. ‘కొరియన్ వార్ టు ఎండ్’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇందుకు సహకరించిన తన స్నేహితుడు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు కృతజ్ఞతలని కూడా ట్రంప్ ట్వీట్ చేశారు. కొద్ది నెలల క్రితం, అణ్వస్త్ర దేశమైన ఉత్తర కొరియా వరుసగా క్షిపణుల పరీక్షలు, ఆరవ అణు పరీక్ష నిర్వహించడం వంటి కార్యక్రమాల వల్ల ఐక్యరాజ్య సమితి ఆంక్షలను ఎదుర్కొంటున్నది. అటువంటి మొండి వైఖరి ప్రదర్శించిన ఉత్తర కొరియా నేడు ఈవిధంగా తన బద్ధ శత్రువు దక్షిణ కొరియాతో స్నేహ గీతికలు పాడటం నిజంగా ఊహించని అద్భుతమే. ఇక కిమ్, ట్రంప్‌ల మధ్య పరస్పర దూషణలు వ్యక్తిగత స్థాయికి చేరుకోవడం మరో కోణం. ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధంతో దక్షిణ కొరియాలో జరిగే శీతాకాలపు వింటర్ ఒలింపిక్స్‌పై నీలినీడలు ప్రసరించాయి. ప్రస్తుతం రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో ఈ క్రీడలకు సంబంధించి ఏవిధమైన ఆందోళనకు ఆస్కారం లేకుండా పోయింది.