అంతర్జాతీయం

కరుగుతున్న మంచుపై నాసా అంతరిక్ష ప్రయోగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, సెప్టెంబర్ 12: భూమండలంలో మంచు పొరలు, సముద్రంలోని మంచు పర్వతాల్లో మార్పులపై పరిశోధనలు చేసేందుకు అమెరికా నాసా అంతరిక్ష సంస్థ కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. అత్యంత ఆధునిక లేజర్ పరికరాలతో కూడిన రోదసీ నౌకనును అంతరిక్షంలోకి ప్రవేశపెట్టేందుకు నాసా సన్నాహాలు చేస్తోంది. ఈ శాటిలైట్‌ను ఈ నెల 15వ తేదీన ప్రయోగిస్తారు. ప్రతి సెకనుకు 60వేల వరకు మార్పులను ఈ శాటిలైట్ నమోదు చేస్తుంది. గ్రీన్‌ల్యాండ్, అంటార్కిటాలో, సముద్రాల్లో మంచు పర్వతాల్లో సంభవిస్తున్న మార్పులను శాటిలైట్ ద్వారా అధ్యయనం చేస్తారు. ఈ వివరాలను నాసా సైన్స్ మిషన్ డైరెక్టరేట్ మైఖేల్ ఫ్రెలిక్ చెప్పారు. అడ్వాన్స్‌డ్ టోపోగ్రఫిక్ లేజర్ అల్టీమీటర్ సిస్టమ్‌ను (అట్లాస్) కూడా శాటిలైట్‌లో అమర్చుతున్నారు. అంతరిక్షం నుంచి భూమండలానికి ఎంత సేపట్ల లైట్ ఫోటాన్లు ప్రయాణించి దృశ్యాలను నమోదు చేస్తాయో అధ్యయనాల తర్వాత వెల్లడవుతుంది. అట్లాస్ ఫ్రతి సెకనుకు పదివేల సార్లు దృశ్యాలను, మార్పులను నమోదు చేసే విధంగా ఆధునీకరించారు. భూమండలంలో చెట్ల ఎత్తు, వాటి విస్తరణ, అడవుల విస్తీర్ణంపై కచ్చితమైన వాస్తవమైన వివరాలు ఈ ప్రయోగం ద్వారా తెలుసుకోవచ్చును. ప్రపంచంలోని అడవుల్లో ఉన్న కార్బన్ డాటా వివరాలను సేకరించవచ్చును. సముద్ర తరంగాల ఎత్తును అంచనా వేస్తారు. మొత్తం భూమండలంలో అడవులు, సముద్రాలు, మంచు పర్వతాలు వాటిల్లో చోటు చేసుకుంటున్న మార్పులపై పూర్తి స్థాయిలో పరిశోధనలు చేపేట్టందుకు వీలుగా నాసా సమాయత్తమవుతోంది.