అంతర్జాతీయం

అఫ్గాన్‌లో మిలిటెంట్ల పంజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జలాలాబాద్, మే 13: తూర్పు ఆఫ్ఘన్ నగరంలో ఉగ్రవాదులు ఆదివారం బీభత్సం సృష్టించారు. ఈ సంఘటనలో కనీసం తొమ్మిది మంది మరణించగా, 30 మంది గాయపడ్డారు. జలాలాబాద్ నగరంలోనని డైరెక్టరేట్ ఆఫ్ ఫైనాన్స్ భవనం సమీపంలో మధ్యాహ్నం రెండు వరుస పేలుళ్లు సంభవించడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. పేలుళ్లకు పాల్పడిన కొంతమంది ఉగ్రవాదులు, భవనంలోకి చొరబడ్డారు. ప్రస్తుతం భద్రతా దళాలు తీవ్రవాదులను వేటాడుతున్నాయని నాంగర్‌హార్ ప్రావెన్సీకి చెందిన ప్రభుత్వ ప్రతినిధి అతావుల్లా ఖోగ్యాని విలేకర్లకు తెలిపారు. ఇప్పటికే ఒక ఉగ్రవాదిని మట్టుపెట్టాయని, ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని తెలిపారు. కాగా భవనంలోకి ఇద్దరు సాయుధ ఉగ్రవాదులు ప్రవేశించినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. కాగా బాంబు దాడిలో మరణించిన ఒక పోలీసు, మరో ఎనిమిదిమంది మృతదేహాలను, గాయపడిన 30మందిని సమీపంలోని జలాలామాద్ ఆసుపత్రికి తరలించినట్టు నగర ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ నజీబుల్లా కమావల్ తెలిపారు. దాడికి తామే బాధ్యులమంటూ ఇప్పటివరకు ఏ సంస్థ ప్రకటించలేదు. ఎప్పుడూ అశాంతిగా ఉండే పాక్ సరిహద్దులోని నంగార్హర్ ప్రావెన్స్‌కు జలాలాబాద్ రాజధాని. ఇక్కడ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ప్రాబల్యం అధికంగా ఉన్నప్పటికీ, తాలిబన్లు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉండటం గమనార్హం. గత బుధవారం కాబూల్ పోలీస్ స్టేషన్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడి తర్వాత ఇదే అత్యంత తీవ్రమైంది. కాబూల్ దాడిలో మొత్తం 10 మంది మరణించారు.
వచ్చే అక్టోబర్‌లో ఆఫ్ఘానిస్తాన్‌లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఓటర్ల నమోదు ప్రక్రియ సాగుతోంది. ఓటర్ల రిజిస్ట్రేషన్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకొనే ఏప్రిల్‌లో వరుస బాంబుదాడులు జరగడం గమనార్హం. తాలిబన్లు, ఇస్లామిక్ స్టేట్‌లకు దేశంలో ఎన్నికలు జరగడం ఎంతమాత్రం ఇష్టంలేదు. ఇప్పటికే తమ ఉద్దేశాన్ని అవి స్పష్టం చేశాయి. ఒకవేళ అతితక్కువ పోలింగ్ జరిగితే, ఎన్నికలు విశ్వసనీయత కోల్పోతాయని అధికార్లు భయపడుతున్నారు. ఇప్పటికే తాలిబన్లు, ఆఫ్ఘన్ ప్రభుత్వం ప్రతిపాదించిన శాంతి ప్రస్తావనను తిరస్కరించడమే కాకుండా ‘ఆపరేషన్ అల్ ఖందాక్’ పేరుతో అమెరికా దళాల లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారు. యుఎస్ ఇంటెలిజన్స్ ఏజెంట్లు, దేశంలోని వారి మద్దతుదార్లే లక్ష్యంగా తాలిబన్లు ఈ దాడులు చేస్తున్నారు. ఇస్లామిక్ స్టేట్ కాబూల్‌లో దాడులను తీవ్రం చేసింది. ఏప్రిల్ 30న ఐఎస్ జరిపిన రెండు బాంబుదాడుల్లో మరణించిన 25 మందిలో, ఎఎఫ్‌పి ప్రధాన ఫోటోగ్రాఫర్‌తో పాటు తొమ్మిది మంది జర్నలిస్టులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో కాబూల్ దేశంలోనే అత్యంత ప్రమాదకర ప్రదేశంగా మారింది. ముఖ్యంగా పౌరులను కాపాడటంలో, ఉగ్రవాదులను ఏరివేయడంలో భద్రతా దళాలు తీవ్ర పోరాటం చేయాల్సి వస్తోంది.