అంతర్జాతీయం

ఇండోనేషియాలో నరమేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోనేషియాలో ఇస్లామిక్ స్టేట్ గ్రూపు సంస్థకు చెందిన ఉగ్రవాదులు ఆదివారం నరమేధానికి పాల్పడి 11 మందిని పొట్టనపెట్టుకున్నారు. ఆదివారం మూడుచర్చిల వద్ద ప్రార్థన చేస్తున్న సమూహాలపై ఆత్మహుతి బాంబర్లు ఈ దాడులకు పాల్పడ్డారు. ఇండోనేషియాలో రెండవ అతి పెద్ద నగరం సురబయాలో ఈ దారుణానికి ఉగ్రవాదులు ఒడిగట్టారు. ఈ ఘటనలో డజన్ల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. 2000 సంవత్సరం తర్వాత మైనార్టీ మతానికి చెందిన ప్రజలపై ఇది రెండవ అతి పెద్దదాడి అని పోలీసులు చెప్పారు. ఆత్మహుతి బాంబర్లలో ముసుగు ధరించిన ఒక మహిళ, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వారు మోటార్ బైక్‌లపై వచ్చి ఈ దాడులకు పాల్పడ్డారు. శాంతా మరియా రోమన్ క్యాథలిక్ చర్చి వద్ద మొదటి ఆత్మహుతి దాడి జరిగింది, ఇక్కడ నలుగురు మరణించారు. ఇందులో ఆత్మహుతికి పాల్పడిన వారు కూడా ఉన్నారు. గాయపడిన 41 మందిలో పోలీసులు కూడా ఉన్నారు. రెండవ దాడి క్రిస్టియన్ చర్చి ఆఫ్ డిపోన్ గెరో, మూడవ దాడి పెంథకోస్త్ చర్చి వద్ద జరిగింది. ఈ దాడులు జరిగిన వెంటనే దేశాధ్యక్షుడు జోకో జోకోవి విడుడో ఈ నగరానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. 2000 సంవత్సరంలో జరిగిన బాంబు దాడిలో 15 మంది మరణించగా, వంద మందికి గాయాలయ్యాయి. ఇండోనేషియాలో మైనార్టీ క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ అనే సంస్థ దాడులకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. మోటార్ బైక్‌పై ఐదుగురు బాంబర్లు వచ్చారని, అందులో ఒక మహిళ ఇద్దరు పిల్లలను కూడా తీసుకువచ్చిందని, ఆమె చేతిలో రెండు సంచులు కూడా ఉన్నట్లు చర్చి వద్ద ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. మహిళా ఆత్మహుతి బాంబర్ ఒక పౌరుడిని హత్తుకుని బాంబులు పేల్చిందని, దీంతో పెద్ద ఎత్తున విధ్వంసం జరిగిందని పోలీసులు చెప్పారు. పేలుళ్లు జరిగిన వెంటనే పెద్ద ఎత్తున పోలీసులు శాంతా మరియా చర్చి వద్దకు చేరుకుని దర్యాప్తును ప్రారంభించారు. ఈ ఘటనను ఇండోనేషియన్ చర్చి అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వం బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సంఘం ప్రతినిధి గోర్మర్ గుల్టోమ్ కోరారు. కాగా వెస్ట్‌జావా టౌన్స్‌లో జరిగిన ఘటనలో పోలీసుల కాల్పుల్లో నలుగురు తీవ్రవాదులు హతమయ్యారు. దేశంలో రెండు డజన్ల తీవ్రవాద సంస్థలు ఉగ్రవాద కార్యకలాపాలకు రెండు దశాబ్ధాలుగా పాల్పడుతున్నాయి. ప్రపంచంలో ముస్లింలు అధిక జనాభా ఉన్న దేశం ఇండోనేషియా. ఇండోనేషియా 260 మిలియన్ల జనాభా కలిగి ఉంది. ఇందులో 9 శాతం మంది చైనాకు చెందిన మైనార్టీ ప్రజలు ఉన్నారు. వీరిలో క్రైస్తవులు ఎక్కువగా ఉన్నారు.
కుటుంబం మొత్తం బాంబర్లే!
ఇండోనేషియాలో ఆత్మాహుతి దాడికి పాల్పడినవారు ఒకే కుటుంబానికి చెందినవారని పోలీసులు తెలిపారు. ఈ దాడిలో తల్లిదండ్రులతోపాటు 18, 16 ఏళ్ల వయస్సున్న కుమారులు, 12, 9 ఏళ్ల వయస్సున్న కుమార్తెలు కూడా ఐసిస్ సానుభూతి పరులేనని తెలిపారు.