అంతర్జాతీయం

మంచు చరియలు విరిగిపడి 9 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాట్మాండూ, అక్టోబర్ 13: హిమాలయ పర్వతాల్లో మంచు చరియలు ఆకస్మికంగా విరిగిపడిన ఘటనలో తొమ్మిది మంది పర్వతారోహకులు మరణించారు. ఈ ఘటన పర్వతారోహకుల్లో విషాదం నింపింది. నేపాల్ వౌంట్ గుర్జా క్యాంపులో ఈ దుర్ఘటన జరిగింది. మరణించిన వారిలో ఐదుగురు దక్షిణ కొరియా జాతీయులు ఉన్నారు. నేపాల్ పశ్చిమ ప్రాంతంలో దౌలాగిరి పర్వతప్రాంతంలో సముద్ర మట్టానికి 3500 మీటర్ల ఎత్తున ఆకస్మికంగా మంచుచరియలు విరుచుకుపడ్డాయి. ఊహించని ఈ ప్రమాదంలో తొమ్మిది మంది సజీవ సమాధి అయ్యారు. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం జరిగినట్లు నేపాల్ పర్వతారోహకుల బృందం విభాగం ఎండీ వాంచూ షెర్పా చెప్పారు. మరణించిన వారిలో ఐదుగురు దక్షిణ కొరియాకు చెందిన వారు, నలుగురు నేపాలీయులు ఉన్నారు. లీ జాహెన్, రీమల్ జిన్, యూ యూంజిక్, జీయాంగ్ జూన్ మోను గుర్తించినట్లు హిమాలయన్ టైమ్ పత్రిక వెల్లడించింది. గుర్జా నుంచి హిమాలయపర్వతాన్ని అధిరోహించాలని అక్టోబర్ 7వ తేదీన వెళ్లారు. మృతదేహాల తరలించేందుకు హెలికాప్టర్‌ను రంగంలోకి దించారు. గుర్జా పర్వతం 7193 మీటర్ల ఎత్తు ఉన్నట్లు అధికారులు తెలిపారు. 2015లో ఈ తరహా ప్రమాదంలో 19 మంది మరణించగా, 61 మందికి గాయాలయ్యాయి. అంతకు ముందు 16 మంది షెర్ప్ గైడ్స్ మంచు చరియలు విరిగిపడి మరణించారు.