అంతర్జాతీయం

గ్రీకు, పోర్చుగల్ ప్రధానులతో భారత ఉపరాష్టప్రతి భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రస్సెల్, అక్టోబర్ 19: గీస్, పోర్చుగల్ ప్రధాన మంత్రులతో భారత ఉప రాష్టప్రతి ఎం.వెంక య్య నాయుడు గురువారం నాడిక్కడ భేటీ అయ్యారు. పరస్పర ఆర్థిక, ప్రజా సహకారాల ద్వారా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఈ చర్చల సందర్భంగా నిర్ణయించారు. 12వ ఆసియా-యూరప్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చిన భారత ఉపరాష్టప్రతి వెంకయ్య గ్రీస్ ప్రధాన మంత్రి అలెక్సిస్ సిప్రాస్, పోర్చుగీస్ ప్రధాన మంత్రి ఆంటోనియో కోస్టాలతో భేటీ అయ్యారు. రక్షణ, అంతరిక్ష పరిశోధన రంగాలతోబాటు వౌలిక సదుపాయలు, స్టార్టప్‌లలో భారత్‌కు సహకారాన్ని అందజేయాలని నాయుడు కోరారు. గ్రీస్‌లో స్థిరమైన ఆర్థిక స్థితిగతులను ఏర్పరచేందుకు తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాని సిప్రాస్ వివరించారు. గత కొన్ని సంవత్సరాల నుంచి భారత్ సాధిస్తున్న ఆర్థికాభివృద్ధి ప్రపంచ ఆర్థిక రంగ స్థితిగతులపై సానుకూల ప్రభావాన్ని చూపుతోందని ఆయన వ్యాఖ్యానించినట్లు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతీయ కంపెనీలు గ్రీస్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సాదరంగా ఆహ్వానిస్తున్నామని ఈ సందర్భంగా సిప్రాస్ అన్నారు. ప్రత్యేకించి తమ దేశంలోని తీరప్రాంతాల అభివృద్ధిపై విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఈదిశగా ప్రధాన మంత్రి మోదీని వీలున్నప్పుడు ఈ దేశంలో పర్యటించి పరిశీలన చేయాల్సిందిగా కూడా గ్రీస్ ప్రధానమంత్రి ఆహ్వానించారు. ఈ రెండు దేశాల మధ్య పర్యాటక రంగ బంధాలు చాలాబాగున్నాయని ఈ సందర్భంగా భారత ఉపరాష్టప్రతి పేర్కొన్నారు. దేశంలోని వివిధ ఎగుమతి విభాగాల నిర్వహణకు, ఐక్యరాజ్య సమతిలోని సంస్కరించిన, విస్తరించిన రక్షణ మండలిలో భారత్‌కు పర్మనెంట్ స్థానం లభ్యం కావడానికి సహకరించిన గ్రీస్‌కు వెంకయ్య నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ఈ బంధాలను భవిష్యత్తులో మరింత బలోపేతం చేసుకోవాలని ఈ సందర్భంగా ఇరు దేశాధినేతలు నిర్ణయించారు. అలాగే పోర్చుగల్ ప్రధాన మంత్రి కోస్టా మాట్లాడుతూ ఇరుదేశాల మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న సంబంధాలపై సంతృప్తిని వ్యక్తం చేశారు. భారత-పోర్చుగల్ వాణిజ్య బంధాలు మరింత ప్రగతి దిశలో సాగుతున్నాయని, భారతీయ మార్కెట్లో పోర్సుగల్ కంపెనీలకు మంచి ప్రోత్సాహం లభిస్తోందని ఆయన చెప్పారు. మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవాలను ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించేందుకు ఏర్పాటైన కమిటీలో భాగస్వామి అయినందుకు ప్రధాని కోస్టాకు వెంకయ్యనాయుడు కృతజ్ఞతలు తెలిపారు. సాంకేతిక రంగాల్లో సరికొత్త అంశాల్లో భారత్-పోర్చుగల్ బంధాలు మరింతగా ముందుకెళతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తమ దేశంలో రక్షణ, అంతరిక్ష రంగాలతోపాటు, స్టార్‌టప్, వౌలిక సదుపాయాల కల్పనలో ప్రధానంగా పెట్టుబడులకు మంచి అవకాశాలున్నాయని నాయుడు ఇరు దేశాధినేతలకు తెలిపారు. ఇరాస రక్షణ మండలిలో భారత్‌కు స్థిరమైన సభ్యత్వానికి సహకరించినందుకు పోర్చుగల్‌కు సైతం వెంకయ్య కృతజ్ఞతలు తెలియజేశారు. అప్పుల ఊబిలో కూరుకుని ఆర్థికంగా వెనుకడుగు వేసిన గ్రీస్ నెమ్మదిగా ఆర్థిక పురోగతిని సాధించిన విషయాన్ని వెంకయ్య గుర్తు చేస్తూ ఆ దేశ ప్రధానిని అభినందించారు.