అంతర్జాతీయం

ఉగ్రవాదంపై రాజీలేని పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, నవంబర్ 27: ఉగ్రవాదులపై ప్రపంచ దేశాలు సమిష్టిగా పోరాటం చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ పిలుపునిచ్చారు. 2008లో ముంబయిలోని హోటల్‌పై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులు జరిగి పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు అండగా ఉంటానన్నారు. ఈ పోరాటంలో ఉగ్రవాదులు గెలవరాదన్నారు. ఈ ఘటనలో 166 మంది మరణించిన విషయం విదితమే. బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలని తాను కోరుతున్నట్లు చెప్పారు. ఈ హింసాకాండలో 166 మంది మరణించారని, ఇందులో ఆరుగురు అమెరికన్లు కూడా ఉన్నారన్నారు. ఈ తరహా ఘటనలను ఉపేక్షించే ప్రసక్తిలేదన్నారు. పాక్‌కు ఆర్థికసహాయం నిలిపివేయాలని ఇటీవల ట్రంప్ ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఉగ్రవాదుల ఏరివేతకు పాకిస్తాన్ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. గతంలో పాకిస్తాన్‌కు సాలీనా 1.3 బిలియన్ డాలర్ల సాయం చేసే వారమన్నార. కాని ఆ దేశం ఉగ్రవాదం నిర్మూలనకు కలిసిరావడం లేదు. అందుకే ఈ సాయాన్ని నిలుపుదల చేశామన్నారు. కాగా ముంబయి దాడిలో తన భర్త, కుమార్తెను కోల్పోయిన షేర్ అనే అమెరికా మహిళ ట్రంప్ వ్యాఖ్యలను అభినందిస్తూ ట్వీటీ చేశారు. కాగా అమెరికాలో కౌంటర్ టెర్రరిజం కో ఆర్డినేటర్ నాథన్ సేల్స్ మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని ఉపేక్షించే ప్రసక్తిలేదన్నారు. పాకిస్తాన్ తన భూభాగంలో ఉగ్రవాద సంస్థలకు బాధ్యులైన వారిని చట్టం ముందుకు తీసుకురావాలని కోరారు.