అంతర్జాతీయం

కలిసి పనిచేద్దాం, ఆర్థికంగా బలపడదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* చైనా, రష్యా అధినేతలతో ప్రధాని మోదీ మంతనాలు
* అన్ని రంగాలపై సహకరించుకోవాలని మూడు దేశాల తీర్మానం
* చర్చలు ఫలప్రదమైనట్లు ప్రకటించిన ప్రధానమంత్రి కార్యాలయం
బ్యూనోస్, ఎయిర్స్, డిసెంబర్ 1: ఐక్యరాజ్యసమితి, ప్రపంచ వాణిజ్య సంస్థలతో పాటు బహుళ వాణిజ్య ఆర్థిక ఏజన్సీల్లో సమూలంగా ఆర్థిక సంస్కరణలు తేవాలని, ప్రపంచ ఆర్థిక రంగంలో బహిరంగ విపణి విధానాల ద్వారా ఆర్థికాభివృద్ధికి అంకురార్పణ జరగాలని భారత్,చైనా,రష్యాలు పిలుపునిచ్చాయి. 12 ఏళ్ల తర్వాత ఈ మొడు దేశాలు సమావేశమై ఆర్థిక రంగం బలోపేతం చేయడంపై కూలంకషంగా చర్చించాయి. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, చైనా అధ్యక్షఉడు జింగ్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదమీర్ పుతిన్‌లు సమావేశమై పై విధంగా పిలుపునిచ్చారు. జీ-20 దేశాల సదస్సు నేపథ్యంలో ఈ ముగ్గురు నేతలు సమావేశమై కీలకమైన ఆర్థికాంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ చైనా, రష్యా అధినేతతో జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయని, పరస్పర సహకారంతో ముందడుగు వేయాలని, లోటుపాట్లను సరిదిద్దుకోవాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. అదే సమయంలో ప్రపంచ శాంతికి పాటుపడాలని నిర్ణయించినట్లు చెప్పారు. అనంతరం ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే, అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్‌తో కూడా సమావేశమయ్యారు. చైనా, రష్యా అధినేతలతో ప్రధానిమోదీ జరిపిన చర్చలు వాణిజ్య రంగంలో కొత్త మలుపుకు నాందిపలికాయని ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. అంతర్జాతీయ వేదికలపై పరస్పరం సహకరించుకోవాలని ఈ సమావేశంలో నేతలు నిర్ణయించారు. ప్రపంచానికి ఉపయోగపడే విధంగా ఐక్యరాజ్యసమితి, ప్రపంచ వాణిజ్య సంస్థ, ఇతర ఆర్థిక ఏజన్సీలను సంస్కరణలను అమలు చేస్తూ సమర్థంగా వినియోగించుకోవాలని మోదీ పేర్కొన్నారు. ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా శాంతి సుస్థిరతలను సాధించడం, ఆర్థికంగా అన్ని వర్గాలకు ఉపయోగపడే విధంగా ఫలాలను అందించాలనే లక్ష్యంతో పనిచేయాలనుకున్నట్లు మోదీ తెలిపారు. బ్రిక్స్, షాంఘై సహకార సంస్థ, ఆగ్నేయాసియా సదస్సు తదితర అంతర్జాతీయ వేదికల ద్వారా తమకు ఎదురవుతున్న సవాళ్లను అధిగమించాలని చైనా, రష్యా, భారత్‌లు తీర్మానించాయి. ఉగ్రవాదం, వాతావరణ మార్పుల విషయంలో సమాచారాన్ని పంచుకోనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. భవిష్యత్తులో ఈ తరహా సమావేశాలు ఏర్పాటు చేయాలని భావించినట్లు చెప్పారు. అనంతరం విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పరస్పరం టెక్నాలజీని మార్చుకోవాలనే దానిపై ఈ ముగ్గురు నేతలు దృష్టిని సారించినట్లు చెప్పారు. విదేశాంగ శాఖ ప్రతినిధి రావీష్ కుమార్ మాట్లాడుతూ, ఈ ముగ్గురు నేతల సమావేశం ఆహ్లాదకరమైన వాతావరణంలో ముగిసినట్లు చెప్పారు. రష్యా, ఇండియా, చైనాల సమావేశాలకు రిక్ అని, జపాన్, అమెరికా, ఇండియాల సమావేశం జై అని ప్రధాని మోదీ పేర్కొన్నట్లు ఆయన చెప్పారు.