అంతర్జాతీయం

జార్జ్ హెచ్‌డబ్ల్యూ బుష్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హూస్టన్, డిసెంబర్ 1: అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ హెచ్‌డబ్ల్యూ బుష్ శుక్రవారం ఇక్కడ మృతి చెందారు. నాటకీయ పరిణామాల మధ్య సోవియట్ యూనియన్ విచ్ఛినమయిన సమయంలో అమెరికా 41వ అధ్యక్షుడిగా జార్జ్ హెచ్‌డబ్ల్యూ బుష్ కొనసాగారు. ఇరాక్ కువైట్‌పై దురాక్రమణకు పాల్పడిన సమయంలోనూ జార్జ్ హెచ్‌డబ్ల్యూ బుష్ నేతృత్వంలోనే అమెరికా ఇరాక్‌ను మట్టి కరిపించి, కువైట్‌కు విముక్తి కల్పించింది. 94 ఏళ్ల జార్జ్ హెచ్‌డబ్ల్యూ బుష్ మృతి చెందిన విషయాన్ని అతని కార్యాలయం ప్రకటించింది. బుష్ అంత్యక్రియలకు సంబంధించిన వివరాలను తరువాత ప్రకటిస్తామని ఆయన అధికార ప్రతినిధి జిమ్ మెక్‌గ్రాత్ తెలిపారు. జార్జ్ హెచ్‌డబ్ల్యూ బుష్ భార్య బార్బరా బుష్ 73 ఏళ్ల వయసులో ఈ సంవత్సరం ఏప్రిల్‌లో మృతి చెందారు. 94 ఏళ్ల వయసు వరకు జీవించి ఉన్న అమెరికా తొలి మాజీ అధ్యక్షుడు
బుష్ కావడం విశేషం. ‘94 మరచిపోలేని సంవత్సరాల తరువాత మా నాన్న మృతి చెందారని ప్రకటించడానికి జెబ్, నెయిల్, మార్విన్, డోరో, నేను విచారిస్తున్నాం’ అని అమెరికాకు 43వ అధ్యక్షుడిగా పనిచేసిన జార్జ్ బుష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో స్థితప్రజ్ఞతతో అమెరికాకు నాయకత్వం వహించిన గొప్ప నేత జార్జ్ హెచ్‌డబ్ల్యూ బుష్ అని జీ-20 శిఖరాగ్ర సమావేశాలలో పాల్గొనేందుకు అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం నివాళులు అర్పించారు. ‘మాజీ అధ్యక్షుడిని కోల్పోయి విచారంలో మునిగిపోయిన అమెరికన్ జాతితో పాటు మెలానియా, నేను ఉన్నాం’ అని ట్రంప్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
పార్కిన్‌సన్స్ వ్యాధితో బాధపడుతున్న జార్జ్ హెచ్‌డబ్ల్యూ బుష్ ఇటీవలి సంవత్సరాలలో వీల్‌చైర్‌కే పరిమితమయ్యారు. ఆరోగ్యం క్షీణించడంతో ఆయన ఇటీవలి నెలల్లో తరచుగా ఆసుపత్రిలో చేరడం, తరువాత డిశ్చార్జి కావడం జరిగింది. భార్య బార్బరా ఏప్రిల్‌లో మృతి చెందినప్పుడు బుష్ కూడా చనిపోతారని అంతా భయపడ్డారు. బార్బరా అంత్యక్రియలు ముగిసిన ఒక రోజు తరువాత ఏప్రిల్ 23న రక్తం ఇన్‌ఫెక్షన్ కారణంగా బుష్ ఆసుపత్రిలో చేరారు. 13 రోజుల తరువాత డిశ్చార్జి అయ్యారు. రక్తపోటు తగ్గడం వల్ల మే నెలలో మళ్లీ ఆసుపత్రిలో చేరారు. కొద్ది రోజుల తరువాత డిశ్చార్జి అయిన బుష్ జూన్ 12వ తేదీన 94వ జన్మదినోత్సవాన్ని జరుపుకున్నారు.
యుద్ధ విమానాలు నడిపిన పైలట్, సీఐఏ మాజీ చీఫ్ అయిన జార్జ్ హెచ్‌డబ్ల్యూ బుష్ 1988 నవంబర్ 8వ తేదీన అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1989 జనవరి 20న పదవీ బాధ్యతలు స్వీకరించిన బుష్ 1993 జనవరి 20వ తేదీ వరకు అధ్యక్షుడిగా దేశానికి సేవలందించారు.