అంతర్జాతీయం

ఇమ్రాన్‌కు నీతి, నిజాయతీ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జూన్ 4: పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్‌ఖాన్‌కు ఎన్నికల ముందే కష్టాలు మొదలయ్యాయి. జూలైలో పాకిస్తాన్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఇమ్రాన్ నిజాయితీ, సత్‌ప్రవర్తన లేని నాయకుడని ఆయన మాజీ భార్య రెహామ్‌ఖాన్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. 2015లో ఖాన్‌కు రెహామ్‌కు వివాహమైంది. పది నెలల కాపురం తరువాత రెహామ్‌కు విడాకులిచ్చిన ఇమ్రాన్ ఖాన్ ఇటీవలే బుష్రా మనేకాను వివాహమాడాడు. నిజాయితీలేని వాడు పార్టీకి నాయకత్వం వహించే అర్హతలేదని ఆమె అన్నారు. తన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సాఖిబ్ నిసార్‌ను కోరారు. పాకిస్తాన్ రాజ్యాంగంలోని 62, 63 ఆర్టికల్ కింద ఇమ్రాన్‌ఖాన్‌పై అనర్హత వేటు వేయాలని కోర్టును ఆమె అభ్యర్థించారు. ఖాన్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని రెహామ్ ఆరోపించారు.