అంతర్జాతీయం

గ్వాటెమాలాలో పేలిన అగ్నిపర్వతం.. 25 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్వాటెమాలా సిటీ, జూన్ 4: ఆదివారం ఫ్యూగో అగ్నిపర్వతం పేలిన సంఘటనలో కనీసం 25 మంది ప్రజలు మరణించారు. పేలిన అగ్నిపర్వతం నుంచి పెద్దఎత్తున వెలువడుతున్న బూడిద, రాళ్ల కారణంగా, గ్వాటెమాలా విమానాశ్రయాన్ని మూసివేశారు. తగిన వెలుతురు లేకపోవడం, ప్రమాదకర పరిస్థితుల నేపథ్యంలో మరణించినవారి ఆచూకీ కోసం చేస్తున్న యత్నాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అగ్ని పర్వతం నుంచి వెలువడుతున్న బూడిద చుట్టుపక్కల ప్రాంతాలను కప్పేస్తోంది. పెద్ద ఎత్తున బూడిద వెలువడుతుండటంతో రైతులు ప్రాణాలు అరచేత పట్టుకొని పారిపోయారు. సైన్యం వీరందరిని సహాయక శిబిరాలకు తరలించింది. అధ్యక్షుడు జిమీ మొరాలెస్... ఇస్‌క్యుంట్లా, ఛిమాల్టెనాంగో, సాకటెపెక్విజ్ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. వందలాది మంది పోలీసులు, రెడ్‌క్రాస్ సంస్థకు చెందినవారు, సైన్యాన్ని ప్రభావిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటివరకు మూడువేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు విపత్తు నివారణ అధికార్లు తెలిపారు.