అంతర్జాతీయం

అధికారంలోకి వచ్చిన పది రోజుల్లో రుణమాఫీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మండసర్ (ఎంపీ), జూన్ 6: తమ పార్టీ మధ్యప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన పది రోజుల్లో రైతుల రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల రైతులు పడుతున్న బాధల నుంచి తాము విముక్తి కల్పిస్తామని ఆయన అన్నారు. మండసర్ జిల్లాలోని పిప్లియా మండిలో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ సమస్యలపై పోరాటం చేసిన ఆరుగురు రైతులను సరిగ్గా సంవత్సరం క్రితం పోలీసులు కాల్పుల్లో పొట్టనపెట్టుకున్నారని అన్నారు. ఈ ఏడాది చివరిలో జరిగే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే ఈ ఆరుగురు రైతుల మరణానికి కారణమైన వారిపై పదిరోజుల్లో చర్యలు తీసుకుంటామని ఆయన హామీనిచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం 15 మంది బడాపారిశ్రామికవేత్తలకు 2.5 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిందని, అయితే బీజేపీ పాలిత రాష్టల్ల్రోని రైతులకు ఒక్క రూపాయి రుణమాఫీ కూడా జరగలేదని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న పంజాబ్, కర్నాటక రాష్ట్రాల్లో తాము రైతులకు రుణమాఫీ చేశామని ఆయన గుర్తు చేశారు. అలాగే యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు రికార్డుస్థాయిలో రైతులకు 70 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసినట్టు ఆయన చెప్పారు. తాను మోదీని కలిసి వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశానని, అయితే దానిపై తనకెలాంటి హామీ లభించలేదని రాహుల్‌గాంధీ విమర్శించారు. గత ఎన్నికల సందర్భంగా దేశంలోని ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తానన్న మోదీ ఇంతవరకు వారి ఖాతాలో ఒక్కపైసా కూడా వేయలేదని అన్నారు. ప్రధానికి బడా పారిశ్రామికవేత్తలపై ఉన్న ప్రేమ సామాన్యులపై లేదని, పేద ప్రజలను, రైతులను కలవడానికి ఆయనకు సమయం లేదని అన్నారు. కాంగ్రెస్ శ్రేణులు ప్రజాబాహుళ్యంలోకి వెళ్లి ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. తనకు దేశ ప్రజలే మొదటి ప్రాధాన్యత అని, తర్వాత రెండు,మూడు స్థానాల్లో పార్టీ కార్యకర్తలు, నేతలు ఉంటారని ఆయన స్పష్టం చేశారు. ప్రజలతో నిత్యం సంబంధాలు పెట్టుకుని, వారి సమస్యలను తెలుసుకుని, పరిష్కరించే వారే ప్రభుత్వంలో ఉండాలని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. అంతకుముందు రాహుల్‌గాంధీ గత ఏడాది కాల్పుల్లో మృతి చెందిన రైతుల కుటుంబాలను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు.