అంతర్జాతీయం

ప్రపంచ శాంతి సూచికలో భారత్ స్థానం 137

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 6: ప్రపంచ శాంతి సూచికల్లో భారత్ 137వ స్థానంలో నిలిచింది. సిడ్నీకి చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనే సంస్థ ప్రపంచ శాంతి సూచికలను ఖరారు చేసింది. ఇందులో 163 దేశాలు పాల్గొన్నాయి. నిఘా, శాంతి భద్రతల పరిరక్షణ విభాగాన్ని పటిష్టం చేయడం, చట్టాలను అమలు చేయడం వల్ల హింసాత్మక ఘటనలు భారత్‌లో గణనీయంగా తగ్గాయని ఈ సంస్థ పేర్కొంది. కాగా ఐస్‌లాండ్ ప్రపంచం మొత్తం మీద సంపూర్ణ శాంతి దేశంగా పేరు తెచ్చుకుంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పోర్చుగల్, డెన్మార్క్ దేశాలు కూడా ప్రపంచ శాంతి సూచికల్లో అగ్రస్థానంలో నిలిచాయి. ప్రపంచంలో అత్యంత అశాంతి దేశంగా సిరియా పేరు తెచ్చుకుంది.
ఆఫ్గనిస్తాన్, దక్షిణ సూడాన్, యెమెన్ దేశాల్లో కూడా శాంతి పరిస్థితులు అంతంత మాత్రమే. గతంలో జరిపిన సర్వేల్లో భారత్ 141వస్థానంలో ఉండేది. కాని ఇక్కడ శాంతి భద్రతలు మెరుగయ్యాయి. దీంతో 137వ స్థానానికి దిగింది. కాగా భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో కాశ్మీర్‌లో సంఘర్షణాత్మక వాతావరణం కొనసాగుతోందని, హింస పెరుగుతోందని ప్రపంచ శాంతి సూచిక నివేదికలో పేర్కొన్నారు. కాగా ఇటీవల కాలంలో భారత్, శ్రీలంక, కొలంబియా, ఉగాండలో పెద్ద ఎత్తున మరణాలు తగ్గాయని ఈ సంస్థ నివేదికలో పేర్కొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అలజడులు, సంఘర్షణలు పెరగడంతో, హింసాను అరికట్టేందుకు వనరుల వినియోగం పెరిగిందని ఈ సంస్థ పేర్కొంది. యుద్ధాల వల్ల సిరియా, మెక్సికో, ఆఫ్గనిస్తాతన్, ఇరాక్, యెమెన్‌లో మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయన్నారు. ప్రపంచ వ్యాప్తగా శాంతి సూచిక 0.27 శాతంమేర క్షీణించింది. ప్రపంచ వ్యాప్తంగా 92 దేశాల్లో శాంతి భద్రతలు క్షీణించగా, 71 దేశాల్లో శాంతి పరిస్థితులు మెరుగయ్యాయి. ఐరోపా, ఉత్తర అమెరికా, ఆసియా పసిఫిక్, దక్షిణ అమెరికా దేశాల్లో కూడా శాంతియుత పరిస్థితులకు విఘాతం కలుగుతోంది. ఇక్కడ సేఫ్టీ తగ్గింది. భద్రత పరమైన సమస్యలు పెరిగాయి. ఉగ్రవాద చర్యల వల్ల శాంతికి భంగం వాటిల్లుతోందని ఈ సంస్థ నివేదికలో పేర్కొంది.