అంతర్జాతీయం

దేనికైనా రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జూన్ 6: దేశంలో ఏకకాలంలో ఎన్నికలకు తాము సిద్ధమని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. లోక్‌సభ, అసెంబ్లీకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనుకుంటే తాము స్వాగతిస్తామని బుధవారం ఇక్కడ వెల్లడించారు. యూపీ రాజధాని లక్నోలో అఖిలేష్ మీడియాతోమాట్లాడుతూ ‘ఒక దేశం.. ఒకేసారి ఎన్నికలకు మేం రెడీ’ అని స్పష్టం చేశారు. ‘ఏకకాల ఎన్నికలు నిర్వహిస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. సమాజ్‌వాదీ పార్టీ స్వాగతిస్తుంది. అలాగే ఓటర్ల పేర్లను ఆధార్‌తో అనుసంధానం చేయండి’ అని మాజీ సీఎం అన్నారు. 2019లోనే ఒకే దేశం..ఒకే ఎన్నికల ఆలోచనను బీజేపీ అమల్లో పెట్టాలని తాము అడుగుతున్నామని ఆయన తెలిపారు. గోరఖ్‌పూర్,్ఫల్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గాలు, కైర్నా, ఫూల్‌పూర్ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి నేపథ్యంలో 44 ఏళ్ల అఖిలేష్ యాదవ్ జమిలి ఎన్నికలపై ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు. గోరఖ్‌పూర్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సొంత నియోజకవర్గం. అలాగే ఫుల్‌పూర్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ వౌర్య సొంత నియోజకవర్గం. కైర్నా లోక్‌సభలో బీజేపీ ఎంపీనే ఉన్నారు. ఇక్కడ ఉప ఎన్నికల్లో ఆర్‌ఎల్‌డీ అభ్యర్థి గెలిచారు. యూపీలో ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఉప ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించాయి. వచ్చే ఎన్నికల్లోనూ అదే వ్యూహాన్ని కొనసాగించాలని నిర్ణయించాయి.