అంతర్జాతీయం

మొక్కల పంపిణీలో గిన్నిస్ రికార్డు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయి, జూన్ 7: భారత్‌కు చెందిన ఒక రైతు షార్జాలో ఎక్కువ సంఖ్యలో మొక్కలు పంపిణీ చేసి గిన్నిస్ రికార్డును నెలకొల్పాడు. కేరళకు చెందిన సుధీర్ గురువాయార్ 4,914 కరివేపాకు మొక్కలను పంపిణీ చేసి గతంలో గురునానక్ దర్బార్ గురుద్వార్ అనే వ్యక్తి మూడు రకాల మొక్కలు 2083 పంపిణీ చేసి మార్చిలో నెలకొల్పిన రికార్డును బద్ధలు చేసినట్టు గల్ఫ్ న్యూస్ వెల్లడించింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఉత్సవాలు జరుపుకుంటున్న సమయంలో గురువాయార్‌కు ఈ ఘనత దక్కడం పట్ల గల్ఫ్‌లోని పలు వర్గాలు ఆయనను ప్రశంసలతో ముంచెత్తుతున్నాయి. గురువాయార్ తన తోటలో పెంచిన మొక్కలనే రెండు స్కూళ్ల విద్యార్థులకు పంపిణీ చేశారు. తాను మూడు నెలలుగా తన తోటలో ఈ మొక్కలను పెంచుతున్నట్టు ఆయన ఈ సందర్భంగా చెప్పారు. వంటల్లో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఉపయోగించేది కరివేపాకని, అందుకే తాను దానిని ఎంచుకున్నట్టు చెప్పారు. తాను పంపిణీ చేసిన కరివేపాకు మొక్కలను విద్యార్థులు క్రిమిసంహారక మందులు వాడకుండా పెంచుతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.