అంతర్జాతీయం

ఎల్లకాలం.. ఇదే స్నేహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కింగ్‌డావో, జూన్ 9: చైనాతో భారత్ సంబంధాలు శాంతియుత స్ఫూర్తికి దోహదపడాలని భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. రెండు రోజుల చైనా పర్యటనలో భాగంగా షాంగై సహకార సంస్థ (ఎస్‌సిఓ) వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు నరేంద్ర మోదీ శనివారం ఇక్కడకు చేరుకున్నారు. ఎస్‌సిఓలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం లభించిన తర్వత మోదీ చైనాకు రావడం ఇదే ప్రథమం. పాకిస్తాన్ సైతం ఇటీవల ఈ సంస్థలో శాశ్వత సభ్యత్వాన్ని పొందింది. ఇరుదేశాల మధ్య దైపాక్షిక సహకారం మరింత బలోపేతమయ్యేందుకు ఆరు వారాల క్రితం చైనాలోని వ్యూహాన్‌లో ఇరుదేశాల మధ్య జరిగిన సమావేశం దోహదపడింది. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అమలయ్యేలా చర్యలు తీసుకునే నేపథ్యంలో ఎస్‌సిఓ సమ్మిట్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. శనివారం మధ్యాహ్నం ఇక్కడకు చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మోదీ సమావేశానికి ముందు కరచాలనం చేస్తూ ఫొటోలకు పోజులిచ్చారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు బలమైన, శాంతియుతమైన స్ఫూర్తిని కలిగించాలని ఈ సందర్భంగా మోదీ ఆకాంక్షించారు. ఇరుదేశాలు అవగాహన, నమ్మకం ఏర్పర్చుకుని గతంలో జరిగిన డొక్లాం సంఘటనలు ఇకముందుపునరావృతం కాకుండా వ్యూహాత్మక మార్గంలో ముందుకుపోవాలని, సరిహద్దు భద్రతా దళాల మధ్య సమన్వయం ఉండాలని నేతలు నిర్ణయించారు. ఇరువురూ ఆర్థిక బంధాలు, వాణిజ్య సంబంధాలు, ఇరుదేశాల ప్రజల సత్సంబంధాలు తదితర అంశాలను చర్చించారు. కాగా, ఇరుదేశాల మధ్య డొకోలాం వివాదానికి సంబంధించి ఏర్పడిన వివాదంలో రెండుదేశాలు తమతమ సైన్యాన్ని 73 రోజుల పాటు మోహరించాయి. అనంతరం భారత్ ప్రాంతంలో నిర్మిస్తున్న వివాదాస్పద రోడ్ నిర్మాణాన్ని చైనా నిలిపివేసింది. భూటాన్, చైనా దేశాలకు డొకోలాం ప్రాంతంపై చాలాకాలంగా వివాదం నడుస్తోంది. ఎట్టకేలకు భారత్, చైనాల మధ్య జరిగిన సుహృద్భావ చర్చలతో ఈ సమస్య గత ఏడాది ఆగస్టు 28న పరిష్కారమైంది. అంతేకాకుండా ఇరుదేశాల మధ్య బంధం పటిష్టమవుతూ వివాదాలు పరిష్కారమవుతూ వచ్చాయి. పాకిస్తాన్ కేంద్రంగా ఉన్న జైష్-ఇ-మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌పై ఐక్యరాజ్యసమితి నిషేధం విషయంలో, ఎన్‌ఎస్‌జి సభ్యత్వం కోసం భారత్ బిడ్ వేసే విషయంలో, వివాదాస్పద ప్రాంతంలో చైనారోడ్ నిర్మాణం విషయంలో మనదేశానికి ఆ దేశం నుంచి సహకారం లభించింది. ఆ తర్వాత ఇరుదేశాల మధ్య ఇంచుమించు ఆరువరకు ద్వైపాక్షిక సమావేశాలు జరిగాయి. కాగా 2001లో ఏర్పడిన ఎస్‌సిఓలో రష్యా, చైనా, కిర్‌గిజ్ రిపబ్లిక్, కజకిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ సభ్యదేశాలుగా ఉండగా, ఇటీవల భారత్, పాకిస్తాన్ చేరాయి.