అంతర్జాతీయం

అమెరికా డాటా చోరీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 9: అమెరికా నేవీకి చెందిన అత్యంత విలువైన డాటాను చైనా ప్రభుత్వ హ్యాకర్లు అపహరించారు. సముద్రగర్భంలో సంచరిచే సబ్‌మెరైన్, ఏంటీషిప్ మిస్సయిల్, ఇతర అతి ముఖ్యమైన డేటాను చైనాహ్యాకర్లు దొంగిలించినట్టు వాషింగ్టన్ పోస్టు వెల్లడించింది. పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక అమెరికా అధికారి తెలిపిన వివరాల ప్రకారం 614 జిగాబైట్లు ఉన్న ఈ డేటాలో కొత్తగా తయారు చేస్తున్న సబ్‌మెరైన్ లాంచ్ చేసే యాంటీషిప్ మిస్సయిల్‌కు సంబంధించి వివరాలు ఉన్నట్టు తెలిపింది. ఈ సూపర్‌సోనిక్ యాంటీమిస్సయిల్స్‌ను 2020 నాటికి తయారు చేసి అమెరికా సబ్‌మెరైన్‌ల నుంచి వాడటానికి ఉద్దేశించి ఈ ప్లాన్‌ను తయారు చేస్తున్నారు. సీ డ్రాగన్ పేరిట చేపట్టిన ఈ మిషన్‌కు సంబంధించిన వివరాలతో పాటు సిగ్నల్స్, సెన్సార్ , సబ్‌మెరైన్ రేడియో రూమ్ వివరాలు, సైటోగ్రాఫిక్ సిస్టమ్స్, సబ్‌మెరైన్ అభివృద్ధికి ఉద్దేశించిన యూనిట్‌ల ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ లైబ్రరీకి సంబందించిన డాటా మొత్తం చైనా హ్యాకర్ల చేతికి చిక్కింది. ఇది ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో జరిగినట్టు వాషింగ్టన్ పోస్టు వెల్లడించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కాంట్రాక్టర్ కంప్యూటర్‌ను హ్యాక్ చేయడం ద్వారా మొత్తం డేటాను అపహరించారు. అయితే కాంట్రాక్టర్ పేరును పత్రిక వెల్లడించలేదు. నూతన మిలటరీ టెక్నాలజీతో తూర్పు ఆసియాలో తిరుగులేని శక్తిగా ఉన్న అమెరికా ఆధిపత్యానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నంలోనే చైనా ఈ చర్యకు పాల్పడి ఉంటుందని భావిస్తున్నారు. డేటా చోరీ విషయం బయటపడిన వెంటనే సైబర్ సెక్యూరిటీ విషయంలో సమీక్ష జరపాలని అమెరికా డిఫెన్స్ సెక్రటరీ ఆదేశించారు. అలాగే ఎఫ్‌బిఐ సహాయంతో యుఎస్ నేవీ కూడా దీనిపై దర్యాప్తు జరుపుతోంది.