అంతర్జాతీయం

నేటి నుంచి సాకర్ సంరంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో, జూన్ 13: ప్రపంచ కప్ సాకర్ చాంపియన్‌షిప్‌కు నగారా మోగింది. క్వాలిఫయర్స్ అడ్డంకిని అధిగమించి, మెయిన్‌కు అర్హత సంపాదించిన 32 జట్లు పోరాడే ఈ మహాయుద్ధానికి సిద్ధంగా 736 మంది ఆటగాళ్ల మధ్య సంకుల సమరం గురువారం రష్యా, సౌదీ అరేబియా జట్ల మ్యాచ్‌తో మొదలుకానుంది. గ్రూప్ దశలో మొత్తం ఎనిమిది గ్రూపులు.. ఒక్కో గ్రూపులో నాలుగు జట్లు ఉంటాయ. ప్రతి గ్రూప్‌లోని నాలుగు జట్లు మిగతా మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఈ దశ ముగిసిన తర్వాత, ఒక్కో గ్రూప్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ‘లాస్ట్-16’కు చేరుతాయ. ప్రీ క్వార్టర్స్‌గా పేర్కొనే ఈ స్థాయలో నాకౌట్ పద్ధతిన మ్యాచ్‌లు జరుగుతాయ. గెలిచిన జట్టు క్వార్టర్ ఫైనల్స్ చేరితే, ఓడిన జట్టు ఇంటిదారి పడుతుంది. అనంతరం నాలుగు జట్లు సెమీస్ చేరతాయ. అందులో గెలిచిన రెండు జట్ల మధ్య టైటిల్ పోరు ఉంటుంది.