అంతర్జాతీయం

బసవేశ్వర ప్రవచనాలు స్ఫూర్తిదాయకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఏప్రిల్ 18: లింగాయత్ తత్వవేత్త బసవేశ్వర ప్రవచించిన సిద్ధాంతాలు ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. లండన్‌లోని థేమ్స్ నది ఒడ్డున నిర్మించిన 12వ శతాబ్దానకి చెందిన ప్రముఖ సంఘసంస్కర్త బసవేశ్వర విగ్రహానికి ఆయన బుధవారం పుష్పాంజలి సమర్పించారు. ‘నా యుకె సందర్శన సందర్భంగా భగవాన్ బసవేశ్వరకు శ్రద్ధాంజలి ఘటించడం నిజంగా ఎంతో గౌరవంగా భావిస్తున్నా’ అని ప్రధాన మంత్రి మోదీ కన్నడ, ఇంగ్లీషు భాషల్లో ట్వీట్ చేశారు.
యుకెలోని బసవేశ్వర ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ, ఈ తత్వవేత్త 885 వ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఈ సంస్థే థేమ్స్ నది ఒడ్డున బసవేశ్వర విగ్రసాన్ని నెలకొల్పింది. ఇదిలావుండగా లింగాయత్‌లకు మైనారిటీ మతంగా గుర్తించాలని కర్నాటక మంత్రివర్గం కేంద్రానికి సిఫారసు చేసిన నేపథ్యంలో మోదీ బసవేశ్వర విగ్రహానికి నివాళులర్పించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కర్నాటకలో లింగాయత్/వీరశైవుల జనాభా 17 శాతం వరకు ఉన్నది. వీరు సంప్రదాయంగా భాజపాకు మద్దతుదార్లు. అయితే రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం లింగాయత్‌ల ఓటుబ్యాంకును కొల్లగొట్టేందుకు, వీరిని మైనారిటీ మతంగా గుర్తించాలని కోరుతూ కేంద్రానికి సిఫారసు చేసింది. అయితే భాజపా మాత్రం లింగాయత్‌లకు మైనారిటీ మత హోదా ఇవ్వడానికి ఒప్పుకోవడంలేదు. ఇదిలావుండగా థేమ్స్ నది ఒడ్డున ‘ఆల్‌బర్ట్ ఎంబార్క్‌మెంట్’ వద్ద నెలకొల్పిన బసవేశ్వర విగ్రహం, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించిన తొలి విగ్రహం మాత్రమే కాదు, పార్లమెంట్ సమీపంలో నెలకొల్పడానికి బ్రిటిష్ మంత్రివర్గం ఆమోదం పొందిన మొట్టమొదటి విగ్రహం కూడా. ప్రజాస్వామ్య విలువలు, స్ర్తిపురుష సమానత్వం కోసం పోరాడిన ప్రముఖ సంఘసంస్కర్తగా ఆయనపై ఉన్న గౌరవంతో బ్రిటిష్ మంత్రివర్గం విగ్రహ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. 1134-1168 మధ్యకాలం నాటి బసవేశ్వర కర్నాటక ప్రాంతానికి చెందినవాడు. ఈయన కుల, మత రహిత సమాజం కోసం పోరాటం సలిపాడు.అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకోసం పోరాడిన వ్యక్తిగా బసవేశ్వరను గుర్తించి పార్లమెంట్ భవనంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. బసవేశ్వరపై గౌరవానికి చిహ్నంగా ఆయన పేరిట ఒక నాణేన్ని, ఒక పోస్టల్ స్టాంపును ప్రభుత్వం విడుదల చేసింది.

చిత్రం: బ్రిటన్‌లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి లండన్‌లోని సైన్స్ మ్యూజియం వద్ద స్వాగతం పలుకుతున్న ప్రిన్స్ చార్లెస్