అంతర్జాతీయం

భారత్‌లో తగ్గిన హెచ్‌ఐవి వ్యాప్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐరాస, జూలై 29: హెచ్‌ఐవి వ్యాప్తికి భారత్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల ఎయిడ్స్, హెచ్‌ఐవి కేసులు గణనీయంగా తగ్గాయని ఐరాస నివేదికలో వెల్లడించింది. 2010 నుంచి 2017 మధ్య గణాంక వివరాలను విశే్లషిస్తే 2010లో 1.20 లక్షల హెచ్‌ఐవి కేసులు నమోదైతే, 2017కు 88వేలకు తగ్గాయి.
ఎయిడ్స్ వల్ల మృతుల సంఖ్య 1.60 లక్షల నుంచి 69 వేలకు తగ్గాయి. హెచ్‌ఐవితో జీవించే వారి సంఖ్య 23 లక్షల నుంచి 21 లక్షలకు తగ్గింది. భారత్‌తో పాటు కంబోడియా, మియాన్మార్, థాయిలాండ్‌లో ఎయిడ్స్ వ్యాప్తి తగ్గింది. సామాజిక రక్షణ వ్యూహం, పటిష్టమైన మార్గదర్శకాల ద్వారా హెచ్‌ఐవి వ్యాప్తిని గణనీయంగా నిరోధించారు. సెక్స్‌వర్క్ కేటగిరీని నేర రహితంగా చూసే కోణం వల్ల హెచ్‌ఐవి వ్యాప్తి 33 నుంచి 36 శాతం మేర తగ్గించారు. కర్నాటకలో సీనియర్ పోలీసు అధికారులు, స్వచ్ఛందసేవా సంస్ధలతో కలిసి వర్క్‌షాపులను నిర్వహించారు. హెచ్‌ఐవి వ్యాప్తిని అరికట్టారు. ఈ అంశంపై సెక్స్‌వర్కర్లలో అవగాహన పెంచారు. మానవ, పౌర హక్కుల సంఘాలను ఈ లక్ష్యసాధనలో భాగస్వాములను చేశారు. గతంలో పోలీసులు తమను అరెస్టు చేసేవారని, కాని వారు నిరంతరం కౌనె్సలింగ్ ఇవ్వడం వల్ల, సెక్స్‌వర్క్‌ను నేర రహితంగా చూసే విధానం వల్ల మంచి మార్పును సాధించామని 4110 మంది సెక్స్‌వర్కర్లు తెలిపినట్లు ఐరాస నివేదికలో వెల్లడించారు. హెచ్‌ఐవి వ్యాప్తిని అరికట్టడంలో బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ విశేషంగా కృషి చేసిందన్నారు. కండోమ్‌ల వినియోగంపై విస్తృతమైన ప్రచారం చేశారు. సామాజిక అవగాహనకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వివరాలను యుఎన్‌ఎయిడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖేల్ సిడ్బీ చెప్పారు. పిల్లలు హెచ్‌ఐవి బారినపడకుండా చూసేందుకు ఇంకా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ దిశగా కృషి చేయాలన్నారు.