అంతర్జాతీయం

ఉగ్రవాదంపై పోరుకు సహకరిస్తాం: మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంపాల, జూలై 25: తన రెండు రోజుల ఉగండా దేశ పర్యటనను విజయవంతంగా ముగించుకున్న ప్రధాని నరేంద్రమోదీ దక్షిణాఫ్రికాకు పయనమయ్యారు. తన ఉగాండా దేశ పర్యటన పూర్తిగా విజయవంతమైందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేసుకునే నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు యొవోరి ముసేవెనితో ప్రధాని చర్చలు జరిపారు. 1997 తర్వాత ఉగాండాను దర్శించిన మొదటి భారత ప్రధానిగా నిలిచిన మోదీ ఆదేశ పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ దేశంతో సంబంధాలను పటిష్టం చేసుకునేందుకు భారత్ పూర్తి సహాయసహకారాన్ని అందిస్తుందని ప్రకటించారు. ఉగ్రవాదం, అతివాదంపై పోరాటానికి తామెప్పుడూ సహకారం అందిస్తామని ఆయన చెప్పారు. అనంతరం దక్షిణాఫ్రికాకు బయలుదేరిన ప్రధానికి ఆ దేశ అధ్యక్షుడు ముసేవెని విమానాశ్రయానికి వచ్చి వీడ్కోలు పలికారు. ఇప్పటికే రెండు దేశాల పర్యటనను ముగించుకున్న ప్రధాని మూడో దేశమైన దక్షిణాఫ్రికాకు బయలుదేరారని విదేశీవ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రవీష్‌కుమార్ ట్వీట్ చేశారు.
‘తన ఉగాండా పర్యటన పూర్తిగా విజయవంతమైందని, అధ్యక్షుడు కగుడ ముసేవని, ఆ దేశ ప్రజల ఆదరణ ఎన్నకూ మరువలేనని’ ప్రధాని పేర్కొన్నట్టు ఆయన చెప్పారు. ఈ దేశాల పర్యటనతో భారత్‌కు ఆ దేశాలతో బంధం మరింత పటిష్టపడుతుందని, ముఖ్యంగా ఆర్థికపరమైన సంబంధాలు మరింత మెరుగవుతాయని ప్రధాని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఉగండాలో ఎనర్జీ, వ్యవసాయ, డెయిరీ సంబంధ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆ దేశానికి 200 మిలియన్ డాలర్ల రుణాన్ని భారత్ అందజేసిందని ప్రధాని చెప్పారు. అంతేకాకుండా ఉగండాలో ప్రస్తుతం గాంధీ విగ్రహం ఉన్న చోట గాంధీ హెరిటేజ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఇలావుండగా బ్రిక్స్ సమావేశంలో పాల్గొనే నిమిత్తం ప్రధాని దక్షిణాఫ్రికాకు వెళ్తున్నారు. జోహన్స్‌బర్గ్‌లో నిర్వహించే ‘బ్రిక్స్ ఆఫ్రికా’ సమావేశంలో ప్రధాని పాల్గొంటారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ శాంతి, భద్రత, గ్లోబల్ గవర్నెన్స్, వాణిజ్య సంబంధ అంశాలు చర్చలోకి వస్తాయని భావిస్తున్నారు. ఐదు అతిపెద్ద ఆర్థిక శక్తులుగా భావించే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికాలను కలిపి ‘బ్రిక్స్‌‘గా వ్యవహరిస్తున్నారు. 2010 వరకు మొదటి నాలుగు దేశాలే ఇందులో ఉన్నప్పుడు వాటిని కేవలం ‘బ్రిక్’గానే వ్యవహరించేవారు. ఇప్పుడు సౌతాఫ్రికా కూడా వీటితో కలవడంతో అనంతరం ‘బ్రిక్స్’గా పిలుస్తున్నారు.