మెయిన్ ఫీచర్

విశ్వాసంతోనే విశే్వశ్వరుని ధర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భ గవంతున్ని ప్రేమించుటలో, పూజించుటలో, సేవించుటలో, కీర్తించుటలో కలుగు అనురాగమే భక్తి అని కదా వ్యాసులు వారు అన్నారు. సచ్చిదానంద స్వరూపుడుగు పరమాత్మ యందు మనకు గల గొప్ప ప్రేమ భావమే భక్తి. అనగా పరమాత్మ సర్వభూతములలో అంతర్భూతమై వుండును. కావున సూక్ష్మంగా సర్వప్రాణులయందు ప్రేమ కలిగి యుండుటయే నిజమైన భక్తి అని నాద మహాముని తెలిపియున్నారు. దయగల హృదయం భగవన్నిలయంగా పెద్దలు వివరించి యున్నా రు. మన ఆత్మస్వరూపమును నిరంతరము చింతంచుచూ, పరమాత్మతో నైక్యమొనర్చుటే భక్తి అని శంకరాచార్య చెప్పారు. సర్వభూతములు ఎవ్వని లోపలనున్నవో, ఏ పురుషుని చేత ఈ సర్వ జగత్తు వ్యాపించబడి యున్న దో, అట్టి పరమపురుషుడు అనన్యభక్తి చేతనే పొందదగినవాడు అని భగవద్గీతలో చెప్పబడింది.
స్వార్థరహితమైన నిజమైన ప్రేమతో, స్వచ్ఛమైన భక్తితో భగవంతున్ని త్వరగా చేరగలము. స్వార్థ త్యాగముతో జీవించుటయే పవిత్రమైనది. ప్రేమ, దయ, కరుణలు లేని హృదయము బీడువారిన భూమిలాంటిది. పరిపూర్ణ విశ్వాసంతో, నిస్వార్థంగా భగవంతున్ని భక్తితో, శ్రద్ధలతో నిరంతరం ఆరాధిస్తే ఆ భగవంతుడు మనలను సకల బాధలనుండి తప్పనిసరిగా కాపాడును. మన రక్షణ బాధ్యత అతడే స్వయంగా చూచుకొనును. ఎవరైతే ప్రతి నిత్యము నన్ను పరిపూర్ణ విశ్వాసంతో అత్యంత భక్తితో ఎడతెగక ధ్యానించుచు, ఎల్లప్పుడూ నాయందే నిష్ట కల్గి యుంటారో, అట్టివారి యొక్క సర్వయోగ క్షేమములను నేనే వహించుచున్నాను అని గీతలో శ్రీకృష్ణ పరమాత్మ వివరించి యున్నారు. ‘్భక్తి రేవ గరీయసీ’ అన్నట్లు ప్రతి ఒక్కరిని వారి వారి మనస్తత్వమును, స్థాయిని బట్టి సాధించటానికి అత్యంత సులువైన మార్గం భక్తిమార్గము ఒక్కటే. భక్తి అనునది నిర్హేతుకంగా ఉండాలి. అనగా నిరంతరం, పూర్ణ విశ్వాసంతో ఉండాలి. అప్పుడే భక్తులకు పరిపూర్ణమైన చిత్తశుద్ధి కలిగి జ్ఞానోదయమై మోక్ష ప్రాప్తి కలుగును. భక్తి తొమ్మిది విధాలుగా చెప్పబడింది. శ్రవణము, కీర్తనము, స్మరణము, అర్చనము, వందనము, సఖ్యము, ఆత్మనివేదనము, పాదసేవనము, దాస్యము. ఈ భక్తి మార్గములనే భక్తియోగమని కూడా చెప్పబడింది. నారద మహర్షి, వాల్మీకి, హనుమంతుడు, ప్రహ్లాదుడు, బలి చక్రవర్తి, భక్తకన్నప్ప, పోతన, భక్తరామదాసు, అన్నమయ్య, త్యాగరాజు, మీరాభాయి, రామకృష్ణ పరమహంస, అంబరీషుడు మొదలైన వారంత పైన చెప్పిన నవ విధములైన భక్తమార్గాలలో ఆత్మజ్ఞానమును పొంది మనకు మార్గదర్శకులై శాశ్వతులైనారు. భక్తిమార్గం సామాన్యులందరికీ తేలికైనది. స. నిస్వార్థంగా భగవంతునమీద పరిపూర్ణ విశ్వాసంతో చేసే పూజయే నిజమైన పూజ. మనస్సును స్వాధీనం చేసుకోవడంలో భగవంతున్ని నమ్మిన వారిదే పైచేయి. భగవంతుని పట్ల ప్రేమను కలిగి ఉండడమే మనస్సును స్వాధీనం చేసుకోవడానికి సులభమైన పద్ధతి. భగవంతుణ్ణి నమ్మినవారు, త్రిగుణాలను స్వప్రయత్నం ద్వారా అధిగమించి, మనస్సును స్వాధీనం చేసుకోవచ్చును. స్వాధీనమైన మనస్సు అత్యంత విలువైనది. అది మనిషిని జ్ఞానోదయంవైపు నడిపిస్తుంది. ఒక పద్ధతి ప్రకారం నిరంతరం భగవంతునిపై నమ్మకంతో ఆలోచనలను నియంత్రించడం ద్వారా మనస్సును అదుపులో పెట్టుకోవచ్చును. మనస్సులో క్షణక్షణం పవిత్రమైన మంచి ఆలోచనా విధానం ద్వారా భక్తి మార్గం ద్వారా ఆధ్యాత్మిక శక్తిని పొందవచ్చును.
మనస్సు ఎంత పవిత్రమైనదైతే దానిని త్వరగా స్వాధీనం చేసుకోవచ్చును. నారద పంచ రాత్రంలో చెప్పిన విధంగా భగవంతుని నామాన్ని నిరంతరం స్మరించడమే మనస్సును నియంత్రించటానికి సరైన మార్గం.
పరిణతి చెందిన సత్త్వ గుణంవల్ల మనిషి భగవంతుని యందు కలిగివుండే ఆధ్యాత్మిక స్థితిని చేరుకుంటాడు. పవిత్రతనూ, జ్ఞానాన్ని కలిగే సాత్త్విక వస్తువుల్ని ఉపయోగించడం ద్వారా సత్త్వగుణం పెరుగుతుంది. ఇది మనిషి ఉన్నతికి ఆధ్యాత్మికతకు దారితీస్తుంది. మనసులో భగవంతునిపై భక్తి విశ్వాసములు కలిగి తన ఇష్టదైవమునందు లక్ష్యసిద్ధి నిల్పి నామ సంకీర్తనము ద్వారా తన జన్మను సార్థకము చేసుకోవాలి. భగవంతుని నామము పరమ పవిత్రమైనది. సకల శక్తి సంపన్నమైనది. భగవన్నామ సంకీర్తన మనకు ఎటువంటి నిబంధనలు లేవు. దీనికి భక్తి ఒక్కటే ప్రధానము. నామ సంకీర్తనము చేయువారికి, విన్నవారికి కూడా ముక్తి కలుగుతుంది. మనస్సుతోనే దీనిని సాధించాలి.

-నల్లా నరసింహమూర్తి