మెయిన్ ఫీచర్

నవీన లక్ష్మిమన సీతమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీతారాములు సాక్షాత్తు లక్ష్మీ నారాయణులే! సీత అయోనిజ. లక్ష్మి క్షీరసాగరోద్భవ. వాల్మీకి రామాయణములో సీతను అయోనిజ అని జనకుడు చెప్పాడు. ‘అథమేకృషతః క్షేత్రం’ లాంగలాదుత్థితా-- మయాక్షేత్రం శోధయతా లబ్దా నామ్నా సీతేతి విశ్రుతా’అని సీతను అయోనిజగా భూమినుంచి పొందానని చెప్పాడు. నేను ఉపచారములు జరుపుటవలన నాకూతురైనది. వీర్యశుల్కగా ప్రకటిస్తున్నాను అని చెప్పాడు.
వాల్మీకి రామాయణములో క్షీరసాగర మథన వృత్తాంతముంది. సీతను భూదేవికి తనయగా అంగీకరింపబడింది. రావణ సంహారార్థము దేవతల కోరికగా రాముడిగా విష్ణువు అవతరిస్తానని మాటిచ్చాడు. లక్ష్మి సీతగా అవతరిస్తుందన్న ప్రసక్తిలేదు. లక్ష్మిగాకాక సీతది ప్రత్యేక వ్యక్తిత్వమని అబేధముగాకాక నవీనలక్ష్మి అన్న భట్టుమూర్తికవి భావన సీతారాముల కల్యాణవేళ తలచుకోదగ్గ చమత్కారము.
నలుడు నిషధ దేశ చక్రవర్తి. హరిశ్చంద్రుడు అయోధ్యానగర రాజు. ఒకే పద్యములో ఇద్దరు మహారాజుల జీవిత ఘట్టాలను చదివింపజేయగల ద్వర్థికావ్యముగ ఖ్యాతి. మొత్తము ఐదాశ్వాశాలు. రామరాజ భూషణుని రచన యిది. ధర్మరాజుకు అరణ్యవాస సమయాన మార్కండేయ మహర్షి ఎన్నో కథలు ఊరటగా చెప్పిన కథలు హరిశ్చంద్ర నలోపఖ్యానము- అవతారిక ఆశీర్వాద మంగళ రూపముగ కావ్యము ప్రారంభమైంది.
శా శ్రీ వైదేహసుతన్ భృగూద్వహజయశ్రీ నబ్జ్భృచ్చావలీ ..................మాకెప్పుడున్
లక్ష్మీ స్వరూపిణియైన సీతను, భృగూద్వహజయశ్రీగ రాముడు పరిణయమాడాడు. శివ ధనుర్భంగముతో సీతాపాణిగ్రహణము, విష్ణుచాప పరిగ్రహముతో పరశురామునిపై విజయము లోక క్షేమకరమైన కుశలము కలిగినది. సీతారాముల వివాహ దీక్షగ ఆ పాణిగ్రహణ సమయ సీతారాముల జంట, రఘువంశ వారసులనందించి, లోకక్షేమమే ప్రధానమై, (కుశలవ జన్మకారకులుగ) సత్కుశలవత్వము కలిగిన వారైనారు. సేవింపందగిన వాడా రామచంద్రుడు మాకు, ఎప్పుడును, శుభశ్రీలు= శుభసంపదలు ఇచ్చునుగాక...
శ్రీ వైదేహసుత పరిణయము, భృగూద్వహ విజయయశ్రీ- ఈ పరిగ్రహయుగము రాముడు సాధించిన జంట విజయాలు. శివచాపము, విష్ణుచాపము రాముని పాణిస్పర్శకు వశమయ్యాయి. కాని సీతారాముల ఉభయపాణిగ్రహణ మహోత్సవముగ మాంగల్య దీక్షావిధి నిర్వహణగా ఐక్యమయ్యాయి. రాములవారిని, సీతామహాలక్ష్మి దరి చేరింది. విష్ణ్వావతార పరమార్థముగ పరశురామ క్షత్రియత్వాన్ని తనలో లీనము చేయించిన విజయ సమయమయింది. ఇది రాములవారి జగత్కుశలవత్త్వ పరమార్థము. కుశలవులకు జననీ జనకులుగ, లోక క్షేమకారకులు సీతారాములు దాంపత్య జీవిత గాథగా సేవ్యనీయమైన రామాయణ పారాయణ కథానాయకీ, నాయకులై, సీతారాములుగ శుభసంపదలిస్తున్నారు.
విష్ణ్వాంశ రామునిది. లక్ష్మీదేవియే సీత అంశగా జన్మించింది. కాదనము. కాని ఆమె భూమిలో అయోనిజగా దొరికినది. జనక మహారాజు పుత్రిగా జానకిగా ఖ్యాతినందినది. అందుచేత అభిదానము అంటే పేరులో నవీనత ఉంది. ఆమె సీతాభిధాన నవీనలక్ష్మి. రామప్రియ. అందుచేత విష్ణుహృదయపీఠి వెలయు లక్ష్మితో పోలిక.... సీతాభిధాన నవీనలక్ష్మిని నిఖిలైశ్వర్యములు కరుణించుగాక అని కవి చమత్కారముగ చేసిన యిష్టదేవతా ప్రార్థన కావ్య పద్య భావ విషయప్రస్తావన ఈ వ్యాసము.
లక్ష్మి కమలప్రియ. చేతిలో కమలము ధరిస్తుంది. సీత చేతిలో కమలాలుండవు. సమస్త లోకములచే సంతోషింపదగిన స్థిరమైన సమస్త సంపదలకు నిలయము ధరణి. భూమినుంచి పుట్టిన కారణముగా సీతాదేవికి హస్తములలో బురదలో పుట్టిన కమలములను ధరించనవసరము లేదు. లక్ష్మీదేవి సముద్రసుత కమలగ సముద్రము నుంచి పుట్టిన కమలములను అభిమానముతో ఆదరించి ధరించింది. సీత భూసుత నవీనలక్ష్మిగ సీతాంశ పుణికిపుచ్చుకున్న చమత్కారముగ భూమియందు లభించే నవనిధుల సర్వాలంకారములు ధరిస్తుంది.
సీతను కృపీటభవ నివేశగ అగ్నిప్రవేశము వలన కూడా భంగపాటు పడని స్థానముగ ఖ్యాతి వహించిన నవీన లక్ష్మి సీత. బురదలో పుట్టినా కనిపించని బురదకు కొంచెము దగ్గరగా ఉంది కనుక లక్ష్మి కృపీటభవ నివాస అనగా పద్మములో ఉండడమువలన భంగములు అనగా కెరటాల కదలిక ఆమెను అటూ ఇటూ కదిపి భంగపాటును సూచిస్తుంది.
పద్మభవకున్న భంగపాటు అగ్నిపునీత సీతకు కలుగలేదు. పూర్ణచంద్రోదయవేళ మచ్చను కలిగి వృద్ధి క్షయములు ఉండీనేనట్లుండే చంద్ర సహోసోదరుడు తోడబుట్టుగా క్షీరసముద్ర జననమా విష్ణుప్రియ లక్ష్మిది. కాని రామాభ్యుదయగా సీత నిష్కళంకయగు నవీనలక్ష్మి. లక్ష్మీదేవి రూపములో కన్న సీతగా రామపత్నిగా అభినవలక్ష్మి అనిపించుకునే అవతార పరమార్థము కలిగి ఉంది. లక్ష్మిగా భూసుతయై సీత చలనములేని సంపదలు కరుణించగలదు. ఆశీర్వాద రూప మంగళముగ నవీనలక్ష్మిగా సీతదిగా రామప్రియ విలాసము. అభినవలక్ష్మిగ సార్థక నామధేయము సాధించిందని భట్టుమూర్తికవి సీతాదేవిచే మనకు ఆశీస్సులిప్పించాడు. హరిశ్చంద్ర నలోపాఖ్యాన ద్వర్థి కావ్య కవి ధన్యుడు...

- జొన్నలగడ్డ మార్కండేయులు