మెయిన్ ఫీచర్

కష్టాలను దూరం చేసే కనకదుర్గ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగన్మాత నామాల్లో దుర్గామాత నామం విశిష్టమైనది. దుర్గానామం పలికేచోట శివుడి కైలాస మందిరమే ఉంటుందంటారు. దుర్గా నామాన్ని గ్రహించి, జపించి, స్మరించడంవల్ల సమస్త దేవతా నామ ఉచ్చారణ ఫలితం లభిస్తుంది. సమస్త ఆపదల సాగరాన్ని దాటడానికి, ఆరోగ్య భాగ్యం కలుగుతుంది. సంపదల వృద్ధి జరుగుతుంది. దుర్గా నామ స్మరణే దుర్భేద్యమైన రక్షణ. దుర్గా నామ స్మరణ ఎవరైతే చేస్తారో వారికి ఈతి బాధలు ఉండవని వేదసారం.
‘యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితా నమస్తస్యై. నమస్తస్యై, నమస్తస్యై నమో నమః’’అని దుర్గా శ్లోకం. సమస్త జీవకోటినందు శక్తి స్వరూపిణిగా, దుర్గాదేవికి ప్రణామములు చేసింది మార్కండేయ పురాణం. దుష్టశక్తులను నాశనం చేయడానికి ఆ మహాశక్తి తన ఇచ్ఛా సంకల్పం చేత అనేక రూపాలు ధరిస్తుంది. ఉగ్రచండ, ప్రచండ, చందోగ్ర, చండనాయిక, చండీ, చండపతి, చండ రూప, అతి చండిక అను భేదాలతో దుర్గాదేవి ఎనిమిది రూపాలలో భాసించుచున్నది. దుర్గానామాన్ని రోజు 108సార్లు జపంచేసేవారు ధనవంతులు, పుత్రవంతులు, జ్ఞాని, దీర్ఘాయుష్మంతులు అవుతారని పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పినట్లు తంత్ర శాస్త్రంలో ఉంది. ‘దుర్గా’నామంలోని ‘దు’అనే అక్షరం దారిద్య్రాన్ని, దుఃఖాన్ని, దుర్భిక్షాలను, దుర్వ్యసనాలను నాశనం చేస్తు, సమస్త రోగాలను నశింపజేస్తుంది. ‘గ’కారం పాపనాశనం, ‘ఆ’కారం అన్యాయ, అత్యాచార, అధర్మ అసుర ప్రవృత్తులను నాశనం చేస్తుంది. దుష్టశక్తులను నాశనం చేయడానికి ఆ మహాశక్తి తన ఇచ్చా సంకల్పం చేత, సర్వకాల సర్వావస్థలయందు అభయములను ప్రసాదించే దుష్టసంహారిణి దుర్గాదేవి ‘‘శివశ్శక్త్యాయుక్తోయది భవతి శక్తి’’అని దుర్గాదేవిని స్తుతించారు ఆదిశంకరాచార్యులు.
అష్టరూపాలలో కూడిన దేవిని, ఆమె ఆయుధాలను, ఆభరణాలను గంథ పుష్పాదులతో అర్చించితే తద్ద్వారా ధర్మార్ధ, కామ, మోక్షాలు సిద్ధిస్తాయి. త్రిశూలం, చక్రం, ఖడ్గం, శంఖం, బాణం, శక్తి, వజ్రాయుధం, దండాయుధాలనే ఎనిమిది ఆయుధాలను తన ఎనిమిది కుడి చేతులతోను, డాలు, చర్మాయుధం, బాణం, పాశం, అంకుశం, ఘంటా వాద్యం, గొడ్డలి, రోకలి వంటి ఆయుధాలను తన ఎడమ చేతులలో ధరించినప్పటికీ ఆమె ఆకృతి భయంకరంగాకాక ప్రశాంత వదనంతో కూడినదై భక్తుల మనోభీష్టాలను నెరవేరుస్తు ఉంటుంది. అష్టదశ భుజములతో ఉండే దుర్గామాత చేతులలోని ఆయుధములు, అభయ, వరముద్రలు, ఆమె ధరించిన ప్రతి ఆయుధములు ఎంతో శక్తివంతమైనవి. మానవులను పాపములు నుండి, మృత్యువు, రోగముల నుండి సకల వినాశముల నుండి రక్షింపబడతాయి. దుర్గను పూజించే వారికి సకల కార్యములందు జయం కలుగుతుందని, మోక్షప్రాప్తి సంప్రాప్తిస్తుందని భవిష్య పురాణంలో పేర్కొనబడింది.
కనకాంబరంపూలు వైరాగ్యప్రాప్తిని కల్గించే పుష్పం కనుక దుర్గను కనకాంబర పూలతో పూజిస్తే దుర్గాదేవి వైరాగ్యమును ప్రసాదిస్తుందట. మరి సంపదలకొరకు మహాలక్ష్మీదేవిని శుక్రవారం, మరియు అష్టమి తిథుల్లో పూజించినట్లే దుర్గాదేవిని అమావాస్యనాడు పూజిస్తే మానవునిలోని దుష్టశక్తులు దూరమై అమ్మ రక్షగా నిలుస్తుంది. దుర్గాదేవి నామాన్ని మూడుసార్లు పఠిస్తే చాలట మూడు కాలములందు చేసిన పాపాలు నాశనమై శతృ, రోగములనుండి విముక్తి లభిస్తుంది. మన గృహాల్లో ఇతర దేవతల విగ్రహాలను పెట్టుకుని పూజించినట్లే, దుర్గాదేవి విగ్రహం పెట్టుకుని ఆరాధించడానికి భక్తులు భయపడతారు. ఎందుకంటే అమ్మ ఉగ్ర స్వరూపాణి అనే భావన భక్తుల్లో బాగా నాటుకుపోయింది. కాని ఉగ్ర స్వరూపిణియైన అమ్మ దుష్టులను దునుమాడుతుంది. దుర్గాదేవి దుష్టశక్తులను దూరంచేస్తుంది. కనుక దుర్గాదేవి విగ్రహాన్ని నిరభ్యంతరంగా పూజించవచ్చునని శాస్త్రాల్లో చెప్పబడింది.
అమ్మకు సమర్పించే పూజాద్రవ్యాలన్నీ ఎర్రగా ఉండడం ఆమెకు ఇష్టం. ఎరుపు అగ్నివర్ణం. పవిత్రతకు సంకేతం అగ్ని. దుర్గాదేవి ఆరాధనవల్ల భయ, రోగ, గ్రహపీడలు, దారిద్య్రం, పాపం, దోషం వంటివి నశించిపోతాయని జగద్గురు ఆదిశంకరాచార్యుల ఉవాచ.

- రసస్రవంతి, కావ్యసుధ