మెయిన్ ఫీచర్

విశ్వయోగి నేతృత్వంలో జ్యోతిర్లింగదర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవాన్ విశ్వయోగి విశ్వంజీ నేతృత్వంలో మహారాష్టల్రో కొలవై ఉన్న ఐదు జ్యోతిర్లింగాలను జనవరి మొదటి వారంలో దర్శించడం ఒక మధురానుభూతిగా మిగిలింది. జనవరి 3 నుండి ఆరురోజుల పాటు జరిగిన ఈ పర్యటనలో స్వామి వెంట 30 మంది భక్తులం వెళ్లాం. గతంలో స్వామి నేతృత్వంలో ఏడు జ్యోతిర్లింగాలను దర్శించగా, ప్రస్తుతం దర్శించిన ఐదు జ్యోతిర్లింగాల సందర్శనతో మొత్తం 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం పూర్తయింది. ప్రస్తుత పర్యటనలో ఐదు జ్యోతిర్లింగాలతో పాటు రెండు శక్తిపీఠాలు, ఒక గురుద్వారాను సందర్శించాం.
స్వామి వెంట వెళ్లిన భక్తుల్లో గుంటూరు, హైదరాబాద్‌తో పాటు అమెరికా నుండి వచ్చిన భక్తులు కూడా ఉన్నారు. ఆకుల కోటేశ్వరరావు, ఆకుల కోటేశ్వరమ్మ, డాక్టర్ సికె రామయ్య తదితరులు కలిసి పర్యటన ప్రణాళిక రూపొందించారు. విమానం ద్వారా మూడువేల కిలోమీటర్లు ప్రయాణించడంతో పాటు లగ్జరీబస్సు, జీపులు, కొన్ని చోట్ల ఆటో-రిక్షాలలో కూడా ప్రయాణించాం.
ఈ పర్యటనలో కొంత మంది యువకులతో పాటు మరికొంత మంది వృద్ధులు కూడా ఉన్నప్పటికీ, వృద్ధులెవరూ ఎక్కడా అలసిపోలేదు. అనార్యానికి గురికాలేదు. కొన్ని చోట్ల పర్యతాలను ఎక్కాము, లోయలాంటి ప్రదేశాల్లో ప్రయాణించాం. మహారాష్టల్రోని ఔరంగాబాద్, నాందేడ్, పర్లివైద్యనాథ్, నాసిక్, పూనె తదితర పట్టణాల్లో పర్యటించాం.
2016 జనవరి 3 వ తేదీన ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ విమానాశ్రయం నుండి విమానంలో బయలు దేరి ఔరంగాబాద్ చేరాం. అక్కడి నుండి 30 కిలోమీటర్ల దూరం పయనించి దౌల్తాబాద్ (దేవగిరి) మీదుగా ఘృష్నేశ్వర్ జ్యోతిర్లింగాన్ని చూసి తరించాము. శివపురాణంలో పేర్కొన్న దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఘృష్నేశ్వర్ జ్యోతిర్లింగం ఒకటి. మహారాష్టల్రోని శివుడి ఆలయాల్లో ప్రవేశించేందుకు హిందూ సంస్కృతి ప్రకారం దుస్తులు (్ధవతి, కండువా) ధరించి దైవదర్శనం చేసుకున్నాం. 12 జ్యోతిర్లింగాలలో ఘృష్నేశ్వర్ జ్యోతిర్లింగం చివరిదని భక్తుల నమ్మకం. 240 అడుగుల ఎత్తున్న దేవాలయం ఎరుపురాయితో నిర్మించబడ్డది. ఐదుఅంతస్తుల శిఖరం నిర్మించారు.
రెండోరోజు అంటే జనవరి 4 న 210 కిలోమీటర్లు పయనించి పర్లి వైద్యనాథ్ వెళ్లాం. పర్లి అనే గ్రామంలో మరో జ్యోతిర్లింగమైన వైద్యనాథ్ ఆలయం ఉంది. బ్రహ్మ, వేణు, సరస్వతి నదుల సంగమంలో పర్లి ఉంది. వైద్యనాథ్ ఆలయం చాలా పెద్దది. వైద్యనాథ్ ఆలయం ప్రాంగణంలోనే మరో 11 దేవాలయాలున్నాయి. వైద్యనాథ్ ఆలయం తర్వాత 26 కిలోమీటర్లు పయనించి అంబెజోగాయ్‌లోని యోగేశ్వరీదేవీ ఆలయానికి వెళ్లాం. యోగేశ్వరీ దేవి 51 శక్తిపీఠాల్లో ఒకటి. ఇక్కడే ఉన్న ఇతర దేవాలయాలను కూడా దర్శించాం. ఆ రాత్రి 130 కిలోమీటర్లు పయనించి నాందేడ్ చేరాం. ఆ రాత్రి అక్కడే గడిపి, ఆ మరురోజు నాందేడ్‌లోని గురుద్వారా దర్శించుకున్నాం.
ఆ తర్వాత మరో 65 కిలోమీటర్లు పయనించి ఔందా చేరాం. అక్కడ మరో జ్యోతిర్లింగమైన ఔందానాగనాథ్ జ్యోతిర్లింగాన్ని సందర్శించాం. ఎనిమిదో జ్యోతిర్లింగమైన ఔందాలింగం వద్దకు తరచూ ఒక పాము వచ్చి ప్రార్థన చేస్తుందని పూజారులు తెలిపారు. ఆ తర్వాత 210 కిలోమీటర్లు పయనించి ఔరంగాబాద్ చేరాం. నాలుగోరోజు అంటే జనవరి ఆరోతేదీన 200 కిలోమీటర్లు పయనించి నాసిక్ చేరాం. అక్కడి నుండి మరో 62 కిలోమీటర్లు పయనించి వాణి చేరాం. వాణిలోనే శక్తిపీఠాల్లో ఒకటైన సప్తశృంగి అమ్మవారిని దర్శించుకున్నాం. జనవరి ఏడోతేదీన త్రయంబకేశ్వర్ వెళ్లాం. త్రయంబకేశ్వర్ మూడు నదులు (వరుణ, అరుణ, గౌతమి) సంగమంగా పేరుతెచ్చుకున్నది. త్రయంబకేశ్వర్ కూడా 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ ప్రాంతంలో ఇతర దేవాలయాలను కూడా సందర్శించాం.
ఆరోరోజైన జనవరి 8 న 300 కిలోమీటర్లు పయనించి భీమశంకర్ చేరాం. అక్కడ భీమశంకర్ జ్యోతిర్లింగాన్ని సందర్శించాం. అక్కడి నుండి పూణే వెళ్లి, అక్కడి నుండి విమానంలో హైదరాబాద్ చేరాం.

- జె.వి.లక్ష్మణరావు