మెయిన్ ఫీచర్

శివానంద విభూతి ( నేడు శివానందమూర్తి గురుదేవుల జయంతి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జయంతి తే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః
నాస్తి యేషాం యశః కాయే జరామరణజం భయమ్!
- వారికి మరణం లేదు! పుట్టుక జరిగింది ఒక్కసారి (మనకు తెలిసి). మరింకో పుట్టుక ఉండే ఋణాలూ లేవు. అయితే వారి ‘శరీరం’ మాత్రం మన మధ్యనే ఉన్నది. అదే ‘కీర్తి శరీరం’ అట్టివారు లోకంలో ఉండొచ్చు. ఉన్నారు... కాగా, మరి కొందరున్నారు. ఆ జ్ఞానుల్లోనే గురువులు. తన జ్ఞానం లోకోపకారకం కావాలని ఆ జీవితమూ పరితపించేవారు! వీరి కీర్తి శరీరం ఈ లోకంలోనే కాదు, ‘జ్ఞానలోకం’- అంటే దేవలోకంలో కూడా కాంతులీనుతూనే ఉంటుంది! - ఇట్టివారికి సాష్టాంగ ప్రణామాలివ్వగలగడం మనం చేసుకున్న పుణ్యఫలం!
శివానందమూర్తి సద్గురువులు మహిమలు చూపలేదు. విభూతులూ రుద్రాక్షలూ రాల్చలేదు. అసంభవాలు సంభవాలు చేస్తారనే ప్రచారం లేనే లేదు. నిశ్శబ్దంగా ఒక యోగి ఏమిచేస్తాడో అది ఆయన చేసారు. అంటే, ఆశ్రయించిన వారికి ధ్యానం నేర్పారు. ఆశ్రయించని వారికి దేశభక్తి అందించారు. దేశ నాయకులను అడుగడుగునా రాజ్యపాలనలో మార్గదర్శకం చేసారు!
అలా వారు వారి రోజువారీ శివాభిషేకం అయ్యాక వారిచ్చే తీర్థంకోసం మేధావులు బారులుతీరి నుంచోవటం రోజూ కనిపించే మామూలు దృశ్యం! ఎందుకంటే ఆ తపోతీర్థం తీసుకుంటే మూడురకాల తాపాలూ తీరతాయని అందరికీ తెలుసుకనుక! ఆ తీర్థంతోబాటు సద్గురువులు హోమియోపతి మందు సూచిస్తారు. జాతకంలో దోషాలు చెప్పి మీరు ఫలానా జపం చేయించండి లేదా చేసుకోండి- అని చెబుతారు. ఇలా హోమియోపతి వైద్యం యోగాసన విజ్ఞానం, జ్యోతిష శాస్త్ర పాండిత్యం ఎప్పుడు సంపాదించారు? పోలీసు డిపార్టుమెంటు ఉద్యోగం ఈ పని చెయ్యనిచ్చిందా? జ్యోతిష్య శాస్త్ర గ్రంథాలకు వారి పీఠికలు అమూల్యమైనవి! కాగా ఎన్నో శివాలయాలు స్థాపించారు. భీమిలిలో మరకత శిలతో శిల్పించబడిన అమ్మవారి ఆలయం ఎందుకు నిర్మించారంటే, తూర్పు సముద్రంలో సముద్రంవైపు చూస్తూ ఉండే తల్లి ఆ తీరవాసులందర్నీ కాపాడాలి- అనిట! ఇట్లాంటిదే వరంగల్లులో సప్తర్షుల ఆలయం ఇంకో హైలైట్!
ఇవ్వాళ దేశంలో సనాతన ధర్మానికి జరుగుతూన్న విధ్వంసం పట్ల సద్గురువుల ఆవేదన అనంతం! ఈ విధ్వంసం దురుద్దేశపూర్వకంగా జరుగుతూన్నదనీ, దాన్ని ఆపుకోని హిందుత్వాన్ని కాపాడుకోవటం ప్రతి హిందువుయొక్క ప్రాథమికబాధ్యత అనేది వారి సూచన. ఈ అన్నిరకాల భ్రష్టత్వానికి మూల కారణంమన రాజ్యాంగంలో చేర్చబడ్డ ‘సెక్యులరిజం’ అనే మాటేననేది వారి దృఢ విశ్వాసం! అనేక సందర్భాల్లో వారు నొక్కి వక్కాణించారు. అనేకానేక వ్యాసాలు రాసారు! సెక్యులర్ మాట రాజ్యాంగంలోంచి పోయినపుడే సౌభాగ్యం, సమరసతల వైపు మన అడుగువెయ్యగలమని ఆయన మరీ మరీ చెప్పేవారు! ఎంతోమంది మేధావులు ఉండగా ఈ మాట ఇంత నిర్భయంగా వెలిబుచ్చిన వ్యక్తి శివానందమూర్తిగారొక్కరే అవ్వడం గమనార్హం.
‘సెక్యులర్’ భావజాలం పేరుతో భ్రష్టాచారం వ్యాపించడం వల్ల ధర్మం అడుగంటిపోతోంది. కుటుంబ వ్యవస్థ నశిస్తోంది. విడాకులు ప్రోత్సహించబడుతున్నాయి. వివాహాలు వావివరసల్లేకుండా జరిగిపోతున్నాయి. గాయత్రీ మంత్రం జపించి లోకక్షేమం కోరవలసినవారు ఆ జపం మానేసారు. ‘అన్ని మతాలు సమానమే’ అన్న భ్రమ వ్యాపిస్తోంది. ‘జన్మ-కర్మ’ మూలస్తంభంగా కల ఒకే ఒక ధర్మం-హిందూ ధర్మం-ఈసడించుకోబడుతోంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకునే ‘మన ధర్మాన్ని సమీక్షించుకోవాలి!’ అని ఏప్రిల్ 2015లో వారు ఒక పిలుపునిచ్చారు!
దానికి ఉదాహరణగా వారు చెప్పిన ఒక విషయాన్ని మనం స్మరించుకోవచ్చు. ‘‘ఇవ్వాళ శివాలయాల్లో జరుగుతున్న శివ పూజలన్నీ జాబాల్యోపనిషత్తులోనివే. జాబాలి ఎవరికో పుట్టినవాడు. కానీ గురువుచేత బ్రాహ్మణుడుగా మలచబడ్డాడు! ఋషి అయ్యి ఏకంగా ఒక ఉపనిషత్తునే మనకు అందించాడు’’ అని వారు ఒక సందర్భంగా అన్నారు! వారి ఏకసంథగ్రాహిత్వానికి ఒక ఉదాహరణ మా ఇంట్లో బోర్డుమీద వున్న లెక్కలు చూసి ‘‘ఇవి ష్యశజష ఒళషఆజ్యశఒలెక్కలు కదూ!’’ అన్నారు. వారు లెక్కలు ఎప్పుడు చదివారు?
మొన్న ఏప్రిల్‌లో భీమిలిలో నేను వారిని కలిసి ‘మీరు మా మధ్య చిరకాలం ఉండాలి. మాకు మీరే దిక్సూచి’’ అన్నాను. వారు పకపక నవ్వారు. ‘‘ఈ జీవుడు ఈ ఉపాధిని ఆశ్రయించాడు. ఈ జీవుడు శాశ్వతుడే. కానీ ఉపాధి ఎంతవరకో మనకు తెలీదు. దానిష్టం దానిది! మనమేం అనగలం!..మీరు మీ అనుష్ఠానాన్నీ, రచనల్నీ కొనసాగించండి. మీలాంటి వాళ్లు పెరగాలి....్భంచేసి వెళ్లండి..అదిగో అదే గుమ్మం!’’
ఎవరువంటి వారు పెరగాలి?
గురువై, సద్గురువై,అంతంతై పరమపూజనీయ డాక్టర్‌జీ, గురుజీల సరసన మరో యుగ పురుషులయ్యారు సద్గురు శివానందమూర్తి. వారు వారి ఉపన్యాసాల్లో, శివాలయాల్లో నిండే ఉన్నారు.

- గుండు సుబ్రహ్మణ్యదీక్షితులు 9885798556