మెయిన్ ఫీచర్

యాదాద్రికి కల్యాణశోభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్తంభోద్భవుడు లక్ష్మీనరసింహుడిగా కొలువైన యాదాద్రిలో బ్రహ్మోత్సవ సంబరం భక్తజనులకు దివ్యానూభూతినిస్తుంది. లోక కల్యాణం, విశ్వశాంతులను కాంక్షిస్తూ ముక్కోటి దేవతలే ఆహుతులుగా 11రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగుతున్న బ్రహ్మోత్సవాల్లో అత్యంత శుభప్రదమూ, లోకకల్యాణ కారమూఐన లక్ష్మీనరసింహుల తిరు కల్యాణోత్సవం ఈ 6న ఉదయం 11గంటలకు వైష్ణవ పాంచారాత్ర ఆగమశాస్తన్రుసారం కన్నుల పండువగా నిర్వహించబోతున్నారు.
అఖిలాండకోటి బ్రహ్మండ నాయకుడు, జగత్ రక్షకుడైన లక్ష్మీనరసింహుడి కల్యాణోత్సవాన్ని ఏటా యాదాద్రి కొండపై ఘనంగా నిర్వహించడం అనాదిగా వస్తున్నది. గరుడోత్సవంతో బ్రహ్మోత్సవాలకు కొండపైకి వేంచేసియున్న ముక్కోటి దేవతలు, సురులు, మునులతో పాటు భక్తజనులు తిలకించే స్తంభోద్భవుడి కల్యాణ ఘట్టం భూలోక వాసులనే గాక ముల్లోకాలను తరింపచేస్తుంది.
అమ్మవారు లక్ష్మీదేవిని స్వామి దరికి చేరుస్తూ నిర్వహించే కల్యాణ మహోత్సవంతో స్వామివారు ఆనందించి సకల లోకాలను ఆనందింపచేస్తారని ప్రతీతి. ఆలయ ఈవో గీతా పర్యవేక్షణలో కల్యాణోత్సవానికి భారీ ఏర్పాట్లు చేశారు. కల్యాణోత్సవానికి ఒక రోజు ముందుగా ఎదుర్కోలు ఘట్టాన్ని అర్చక పండిత బృందం సంబరంగా, శాస్తయ్రుక్తంగా నిర్వహించారు. ముక్కోటి దేవతల సాక్షిగా ఎదుర్కోలు ఘట్టంలో అశ్వవాహన రూఢుడై వచ్చిన లక్ష్మీనరసింహుడికి, ముత్యాల పల్లకీలో వేంచేసిన సముద్ర తనయ లక్ష్మీదేవికి ఇరుకుటుంబాల పెద్దలు, దేవతలు, మునులు సమక్షంలో పరస్పరం ప్రవర చదివారు. కల్యాణోత్సవం రోజున హనుమంతుడి విశేష వాహన సేవతో శ్రీరామాలంకారం సేవలందుకున్న తరువాత గజవాహనురూఢుడై పెళ్లికొడుకుగా ముస్తాబైన స్వామివారు, ముత్యాల పల్లకీలో లక్ష్మీదేవీవారు మేళతాళాలు, మంగళవాయిధ్యాల మధ్య పెళ్లి మండపానికి విచ్చేస్తారు. యాదాద్రి ప్రధానర్చాకులు నందీగల్ నరసింహాచార్యులు, కారంపూడి నరసింహాచార్యులు, యాజ్ఞికులు శ్రీనివాసచార్యులు నేతృత్వంలో శాస్తయ్రుక్తంగా జరిపే స్వామి అమ్మవార్లకు కల్యాణోత్సవం ఆద్యంతం కన్నులపండువగా సాగుతుంది. గంగా, కావేరి, కృష్ణా, గోదావరి, యుమునా పుణ్యనదుల జలాల ఆవాహాన, సంప్రోక్షణ, రక్షబంధనం, ద్వితీయ సువర్ణ యజ్ఞోపవీత ధారణ, మధుపర్క నివేధన, నూతన వస్త్రాలంకారణ, కన్యాదానం ఘట్టాలు నిర్వహిస్తారు. లక్ష్మీదేవి తండ్రిఐన సముద్రుడు స్వామివారికి పాదప్రక్షాళన చేసి కన్యాదానం చేస్తారు. తదుపరి వధూవరులకు జీలకర్ర బెల్లం ధారణ గావిస్తారు. రంగురంగుల పుష్పాలు, దేదీప్యకాంతులతో అలంకృతమైన పెళ్లి మండపంలో తిరుమలేశుడు పంపిన పట్టువస్త్రాలతో కల్యాణమూర్తులుగా అలంకృతులై కొలువుతీరిన లక్ష్మీనరసింహుల కల్యాణోత్సవంలో మాంగల్యధారణ ఘట్టం వర్ణించడానికి ఆ బ్రహ్మదేవునికి కూడా తరంకాదంటారు. కల్యాణమూర్తులైన లక్ష్మీనరసింహులకు బ్రహ్మముడులువేసి, మంగళ నీరాజనాలు, ఆశీర్వచనాలు పొందాకా గజవాహనంపై తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చి తిరిగి ఆలయానికి చేరుకుంటారు. మరుసటి రోజున గరుడవాహన సేవ, దివ్యవిమాన రథోత్సవంతో భక్తులకు స్వామి దేవేరితో కలసి దర్శనమిస్తారు. బ్రహ్మోత్సవాలను నూతనంగా తయారవుతున్న బాలాలయంలోనే నిర్వహిస్తున్నారు. స్వామివారికి నిర్వహించే దశావతార ఆలంకార సేవలు, విశేష వాహాన సేవలన్నీ కూడా బాల ఆలయం గడప లోపునే నిర్వహిస్తున్నారు. గడపలోపు స్తంభోద్భవుడిగా ఉద్భవించిన స్వామివారు గడపలోపునే ఈ దఫా బ్రహ్మోత్సవాలు జరుపుకోవడం విశేషం

- వై నరసింహారెడ్డి