ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండో-పాక్ బోర్డర్‌లో 1971లో జరిగిన రియల్ ఇన్సిడెన్స్ బేస్ చేసుకుని మలయాళంలో రూపొందించిన చిత్రం ‘1971 బియాండ్ బోర్డర్స్’. మలయాళం సూపర్‌స్టార్ మోహన్‌లాల్, అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ హీరోలుగా నటించిన ఈ చిత్రానికి మేజర్ రవి దర్శకుడు. గత ఏడాది మలయాళంలో విడుదలై ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని జాష్‌రాజ్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీజ్యోతి క్రియేషన్స్ బేనర్‌పై ఎ.ఎన్.మాలాజీ తెలుగులోకి ‘యుద్ధ్భూమి’ పేరుతో అనువదిస్తున్నారు. అనువాద కార్యక్రమాలు ఫైనల్ దశలో వున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను కేరళలో మోహన్‌లాల్ చేతులమీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా మోహన్‌లాల్ మాట్లాడుతూ- మేజర్ రవి అద్భుతమైన దర్శకుడు. ఆర్మీలో తను చాలాకాలం పనిచేయడంతో ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌తో ఇప్పటికి పది సినిమాలు తీశారు. అందులో ఐదు సినిమాలు నాతోనే చేశారు. తెలుగులోకి అనువాదమవుతున్న యుద్ధ్భూమి కూడా ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందింది. నాకు చాలా సంతృప్తినిచ్చిన ఈ చిత్రం సహజత్వానికి దగ్గరగా ఉండేలా ఒరిజినల్ బోర్డర్‌లో చాలావరకు చిత్రీకరించడం జరిగింది అన్నారు.దర్శకుడు మేజర్ రవి మాట్లాడుతూ- ఇప్పటివరకు నేను తీసిన పది సినిమాలు ఆర్మీ నేపథ్యంలో ఉంటాయి. నిజంగా ఒక సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌తో ఐదు సినిమాలు తీయడం అనేది నా అదృష్టం. యుద్ధ్భూమి చిత్రంనాకు చాలా మంచి పేరు తెచ్చింది. ఇండో-పాక్ బోర్డర్‌లో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం అన్నారు. యంగ్ డైనమిక్ సోల్జర్‌గా అల్లు శిరీష్ నటించారు. ఈ సినిమాను తెలుగులో ఎ.ఎన్.బాలాజీ రిలీజ్ చేయడం చాలా ఎగ్జైటింగ్ వుంది. ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందన్న నమ్మకం ఉంది.