శ్రీకాకుళం

చికెన్‌సెల్ ఎనీమియాపై అప్రమత్తంగా ఉండండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీతంపేట, జనవరి 22: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో చదువుతున్న గిరిజన విద్యార్థినీవిద్యార్థులు తరుచూ చికెన్‌సెల్ ఎనీమియా బారినపడుతున్నారని, అటువంటి విద్యార్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులను రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖా మంత్రి రావెల కిషోర్‌బాబు ఆదేశించారు. ఐటిడిఎ పిఒలు, అధికారులతో శుక్రవారం మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుండి అన్ని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో గ్యాస్‌ను
వినియోగించి వంటకాలు జరపాలన్నారు. ప్రీ పోస్టుమెట్రిక్ స్కాలర్‌షిప్స్‌కు సంబంధించి విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. అన్ని పనులకు పారదర్శకంగా చేయాలని ఆదేశించారు. ఆశ్రమపాఠశాలల్లో పనిచేస్తున్న సిఆర్‌టిలను గౌరవ వేతనం రూ.1200 పెంచేందుకు ఆలోచిస్తున్నామని అన్నారు. విద్యార్థుల ఉపకార వేతనాలు అప్‌లోడ్ వారంలో పూర్తిచేయాలని ఆదేశించారు. అనంతరం ఇంజనీరింగ్ పనులపై సమీక్షించారు. నిర్మాణ పనులు సకాలంలో పూర్తిచేయాలని, పనుల్లో నాణ్యత ప్రమాణాలు తుచ తప్పకుండా పాటించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఐటిడిఎ పిఒ జల్లేపల్లి వెంకటరావు, డిడి ఎంపివి నాయక్, డిప్యూటి డిఇఓ మల్లయ్య, టిడబ్ల్యు ఇఇ శ్రీనివాస్ తదితర అధికారులు పాల్గొన్నారు.

వస్త్ర విక్రయాల్లో
తకరారు!
ఆంధ్రభూమి బ్యూరో - శ్రీకాకుళం
రోజుకు రెండున్నర కోట్ల రూపాయలు వ్యాపారం..బ్రాండెడ్, నాన్-బ్రాండెడ్ అంటూ రశీదులు ఇవ్వడంలో అవకతవకలు..సంక్రాంతి బిజీలో క్యాష్ అండ్ కేరీ కొత్త నినాదం..బ్యాంకు కార్డులకు నో ఛాన్స్..ఇలా జిల్లాఅంతటా వస్తవ్య్రాపారులు పండుగ చేసుకున్నారు. పండగలు, పబ్బాల్లో బట్టల వ్యాపారంలో వచ్చే లాభాలతోనే అంతగా అమ్మకాలు ఉండని మిగిలిన మరో ఆరుమాసాలు జీతభత్యాలు ఇస్తూ దుకాణాలకు తాళాలు వేయకుండా ఉంచాలన్న తపన వస్తవ్య్రాపారుల్లో ఎక్కువగా కన్పించేంది. కాని - అంతకుమించి లాభార్జనగా ఈ పండుగ వారిని సంతృప్తి పరిచినప్పటికీ, న్యాయపరమైన చిక్కులకు ఆ(వా)జ్యం పోసింది! పొందూరు మండలం కనిమెట్ట గ్రామానికి చెందిన చిగులపల్లి రాంప్రసాద్ అనే యువకుడు వస్తవ్య్రాపారులకు ప్రభుత్వం పన్నుల రాయితీ కల్పించినప్పటికీ ఆ మేరకు వస్త్రాల అమ్మకాల్లో ధర తగ్గించలేదని ఆరోపిస్తూ వాజ్యం వేసినట్లు తెలిసింది. 5 శాతం వాణిజ్యపన్నులశాఖకు అమ్మకాలపై చెల్లించాల్సిన పన్ను ప్రభుత్వం నుంచి మినహాయింపు పొందిన వస్తవ్య్రాపారులు అంత మొత్తానికి వస్త్రాలపై ధరలు తగ్గించినట్లు ఎక్కడా ప్రకటించలేదని, ప్రకటించకపోయినప్పటికీ, ఆ వ్యత్యాసంలో అమ్మకాలు చేయలేదంటూ న్యాయస్థానంలో శ్రీకాకుళం జిల్లా వస్తవ్య్రాపారుల సంఘం పెద్దలను తప్పుపడుతూ ప్రజావాజ్యం వేసినట్లు సమాచారం. 2012 జనవరి, 23న. వ్యాట్‌పై వ్యాపారులంతా ఆందోళన చేసి, దుకాణాలన్నీ బంద్ చేసి వారి నిరసన తెలిపారు. అప్పటి పరిస్థితుల్లో వస్తవ్య్రాపార సంఘాల పెద్దలంతా రాష్ట్ర నేత నుంచి జిల్లా నేత వరకూ వ్యాట్ టాక్స్ వల్ల చిన్న, మధ్యతరగతి వస్త్ర వ్యాపారులంతా రోడ్డునపడతారని, వినియోగదారులకు అదనపు భారం భరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఐదు శాతం వస్త్రాలపై పన్ను చెల్లించలేమంటూ చేసిన నిరసనలు, ధర్నాలు, బంద్‌ల కారణంగా 2014 సార్వత్రిక ఎన్నికల ముందు అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి వస్తవ్య్రాపారుల ప్రభావం ఎన్నికలపై పడుతుందన్న ఆలోచన, వారి ఓటుబ్యాంకుపై ఆశలు కలిపి అప్పట్లో ఐదు శాతం పన్ను వస్త్రాలపై లేకుండా ఉత్తర్వులు విడుదల చేసారు. నాటి నుంచి నేటి వరకూ వస్త్రాలు కొనుగోలు చేస్తున్న బీదబడుగువర్గాలకు మాత్రం ప్రభుత్వం కల్పించిన వెసులుబాటు మేరకు ధరలు తగ్గించి అమ్మకాలు జరిపిన దాఖలాలు లేవు. ఎందుకంటే - యార్న్ ధరలు గత రెండు సంవత్సరాలుగా 40 శాతం మేరకు పెరిగాయని, పన్నులు చెల్లించినప్పుడు వస్త్రాల ధరలు పెంచలేదని, అందుకే పన్నులు కట్టకపోయినా వస్త్రాలు ధరలు తగ్గించలేదంటూ జిల్లా వస్తద్రుకాణాల సంఘం నేతలు కోణార్క్ శ్రీను, సతీష్‌లు చెబుతున్న మాట. ఏదిఏమైనప్పటికీ రోజుకు 1.80 కోట్ల రూపాయల వ్యాపారం జరిగే శ్రీకాకుళం జిల్లాఅంతటా కేవలం పెద్దపండుగ నేపథ్యంలో వాణిజ్యపన్నులశాఖకు 8.50 కోట్ల రూపాయలు రశీదులు ఇవ్వకుండా వస్త్రాల అమ్మకాల్లో విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను చెల్లించలేదన్న అంచనాలు కూడా ఆ శాఖ ఉన్నతాధికారులు వద్ద ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రతీ ఏటా సంక్రాంతి పండుగకు నెలరోజులు ముందుగానే వాణిజ్యపన్నులశాఖను గౌరవంగా కలిసే వస్తవ్య్రాపారుల సంఘం నేత ఈసారి కలిసేందుకు అవకాశం లేకుండా ఆ శాఖ ఉన్నతాధికారులు చేసారు. నిర్వహించిన ప్రతీ దాడికి రశీదులు ఇచ్చి పెనాల్టీలు, రుసుములు చెల్లించిన కొందరు వస్తవ్య్రాపారులు వాణిజ్యపన్నులశాఖకు ఎగనామం పెట్టాలన్న వ్యూహాంతోనే ఈ సారి బ్రాండెండ్ బాదుడుకి సిద్ధపడ్డారు. కోల్‌కతా, ముంబాయి నగరాల నుంచి కేజీల తూకానికి కొనుగోలు చేసిన రెడీమేడ్ బట్టలకు బ్రాండెండ్ స్టిక్కర్లు కుట్టించి వందరెట్లు అధిక ధరలకు ఈ ఏడాది కొందరు వస్తవ్య్రాపారులు జరిపిన అమ్మకాలకు మధ్యతరగతి, సామాన్య ప్రజలు జేబులు చిల్లుపడ్డాయి. వందల్లో గల ప్యాంట్,షర్టులు వేలల్లో అమ్మకాలు చేయడం ఒక ఎతె్తైతే, రశీదులు లేకుండా వ్యాపారం చేసి వాణిజ్యపన్నుల శాఖ కళ్ళుకప్పి కోట్లాది రూపాయలు ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారు. ఇలా మోసపోతున్న జనంలో ఒక్కడు మాత్రం వస్తవ్య్రాపారంలో జరుగుతున్న మోసాలపై ప్రజావ్యాజ్యం వేయగలిగే ధైర్యాన్ని తెచ్చుకుని, న్యాయస్థానానికి ఆశ్రయించాడు! దీనిపై ఎటువంటి సామాన్యుడి గోడుకు ఎటువంటి న్యాయం లభిస్తుందో చూడాలిమరీ!!

............
ఇంకెంత కాలం మోసం చేస్తారు?
శ్రీకాకుళం(టౌన్), జనవరి 22: ఎన్నికల్లో మోసపూరిత హామీలిచ్చి అధికారం చేపట్టిన తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలను ఇంకెంత కాలం మోసం చేస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రొక్కం సూర్యప్రకాశరావు మండిపడ్డారు. శుక్రవారం స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పిన నేతలు రాష్ట్రంలో ఆదర్శ రైతులు,
ఫీల్డు అసిస్టెంట్లు, ఉపాధి మేట్‌లు, ఆశా వర్కర్లు, గృహనిర్మాణ సహాయకులు ఇలా అన్ని వర్గాల వారిని రోడ్డు పాల్జేశారని విమర్శించారు. ఇది చాలదన్నట్టు నేడు ఆరోగ్య మిత్రలను తొలగించి వారి కుటుంబాలను అనారోగ్యంపాలు చేయడం ప్రభుత్వానికి తగదని హెచ్చరించారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను వైఎస్సార్సీపి ఎండగడుతుంటే, పార్టీకి అండగా నిలుస్తున్న వర్గాలపై టిడిపి ప్రభుత్వం అక్కసు వెల్లగక్కి అనగదొక్కే ప్రయత్నం చేస్తోందన్నారు. ఎన్నికల ముందు మత్స్యకార్లకు ఇచ్చిన హామీ ఏ ఒక్కటి నెరవేర్చకుండా నేడు వారి జీవితాలతో ఆటలాడుకునే ప్రయత్నం జిల్లా టిడిపి నేతలు చేస్తున్నారని ఆరోపించారు. ఇందుకు భావనపాడు పోర్టు ఉదాహరణగా పేర్కొంటూ ఎప్పటినుండో మత్స్యకారులను ఎస్టీలో చేర్చాలని కోరుతుండగా, విస్మరించిన నేతలు నేడు భావనపాడు పోర్టు నిర్మించి వారిని ఉద్ధరిస్తామనడం వెనుక దురుద్ధేశ్యాన్ని మత్స్యకారులు అర్థం చేసుకోవాలన్నారు. దీనికోసం సుమారు ఆరువేల ఎకరాల భూములు సేకరణకై బలవంతంగా నైనా గ్రామాలను ఖాళీ చేయించేందుకు టిడిపి నేతలు ప్రయత్నాలు మొదలెట్టారని, అయితే మత్స్యకారుల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుందని తెలిపారు. సమావేశంలో ఎన్ని ధనుంజయ, శిమ్మ రాజశేఖర్, పాలిశెట్టి మధుబాబు, గుడ్ల దామోదరరావు తదితరులు పాల్గొన్నారు.

తోణంగిలో ఓడ మరమ్మతుల పరిశ్రమ
గార, జనవరి 22: మండలం తోణంగి రెవెన్యూ పరిధిలో ఓడ మరమ్మతుల పరిశ్రమ ఏర్పాటుతో పాటు శిక్షణా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కంపెనీ ముందుకు వచ్చింది. సుమారు రూ. 500కోట్లు ప్రతిపాదనతో ఏర్పాటు చేయనున్న ఈ పరిశ్రమకు సంబందించి ఫిషింగ్ విభాగం ఆధ్వర్యంలో సంబంధిత కంపెనీ ప్రతినిధులు శుక్రవారం తోణంగి, కొమరవానిపేట, మొగదాలపాడు, బలరాంపురం ప్రాంతాల్లో
పరిశీలించారు. తోణంగి ప్రాంతంలో ఉప్పు పరిశ్రమ ప్రాంతంలో సర్వే నెం. 191లో గల 217 ఎకరాలు ఫారెస్టు భూమిని పరిశీలించారు. నదులు, సముద్రాలు, షిప్ యార్డుల్లో ఇసుక మేటలు తొలగించే యంత్ర పరికరాలుతో పాటు ఈ కంపెనీ వద్ద సుమారు 20 వరకు ఓడలు ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఓడ మరమ్మతు అంశాల్లో యువతకు శిక్షణ ఇచ్చే దిశగా శిక్షణా కేంద్రం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. అలాగే కొర్లాం పంచాయతీ కొమరవానిపేట-మొగదాలపాడు ప్రాంతంలో గల ఉప్పుగెడ్డ, బలరాంపురం ప్రాంతంలోని ఉప్పుగెడ్డను లోతు చేసి గట్టు పటిష్టం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిన నేపథ్యంలో ట్రెడ్జింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు ఈ ప్రాంతాలను కూడా పరిశీలించారు. వీరితో పాటు ఆర్డీఓ. బలివాడ దయానిధి, తహశీల్దారు ఎ. సింహాచలం, ఫిషరీష్ డి.డి. యాకూబ్ బాషా, ఎఫ్.డి.ఓ. గంగాధర్, రెవెన్యూ పరిశీలకుడు రామక్రిష్ణ తదితరులు ఉన్నారు.

నేటి నుండి
సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఉచిత వైద్య పరీక్షలు

నరసన్నపేట, జనవరి 22: రాష్ట్రప్రభుత్వం ఆదేశాల సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఉచిత వైద్యపరీక్షలను నిర్వహించేందుకు శ్రీకారం చుట్టినట్టు జిల్లా ఆరోగ్య సమన్వయ అధికారి టి.వీరాస్వామి తెలిపారు. శుక్రవారం స్థానిక సమాజిక ఆరోగ్య కేంద్రానికి విచ్చేసిన ఆయన మాట్లాడారు. మోడల్ సంస్థ ద్వారా ఉచితంగా అన్ని సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించేందుకు శనివారం నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే జిల్లాలో నరసన్నపేట, ఇచ్ఛాపురంలో సుమారు రూ.17కోట్లతో నూతనంగా నిర్మించనున్న భవన నిర్మాణ పనులు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వైద్యుల పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేసిందని దీనిలో భాగంగా జిల్లాలో ఆరు ఖాళీలను భర్తీచేశామని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సూపరింటెండెంట్ ఎన్.పద్మావతి, వైద్యులుఅధికారులు పాల్గొన్నారు.
స్వచ్ఛ్భారత్‌పై ర్యాలీ
ఎచ్చెర్ల, జనవరి 22: మండలంలోని చిలకపాలెం కూడలిలో ఉన్న శ్రీశివానీ ఇంజినీరింగ్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు శుక్రవారం స్వచ్ఛ్భారత్‌పై హైవేపై ర్యాలీ నిర్వహించారు. తొలుత కళాశాలలో పరిసరాల పరిశుభ్రత పాటించి పిచ్చిమొక్కలు తొలగించారు. అక్కడి నుండి ర్యాలీగా చిలకపాలెం కూడలికి చేరుకొని వీరంతా స్వచ్ఛ్భారత్ ప్రాముఖ్యతను తెలియజేసేలా మానవహారం చేపట్టారు. ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతకు ఇచ్చే ప్రాధాన్యతను పరిసరాల పరిశుభ్రతకు ఇవ్వాలని సూచించారు. ప్రిన్సిపల్ బి.మురళీకృష్ణ, కళాశాల యాజమాన్య కమిటీ ప్రతినిధులు పి.దుర్గాప్రసాదరాజు, డి.వెంకటరావు, దుర్గాశ్రీనివాస్, సాయినాథరెడ్డి, శ్రీనివాస్, జె.సూర్యచంద్ర, విద్యార్థులు ఉన్నారు.
తల లేని లేగదూడ జననం
గార, జనవరి 22: మండలం కొత్తూరు- సైరిగాం పంచాయతీ అప్పాజిపేట గ్రామంలో జన్యులోపంతో తల లేని లేగదూడ జన్మించింది. గ్రామానికి చెందిన ముంజేటి కేశవకు చెందిన ఆవు శుక్రవారం జన్యులోపం కారణంగా తల లేని లేగదూడకు జన్మనిచ్చింది. పుట్టిన వెంటనే ఈ లేగదూడ మృతిచెందింది. తల లేకపోవడంతో పరిసర ప్రాంతాల ప్రజలు లేగదూడను చూసేందుకు తరలివెళ్ళారు.
ఆరోగ్యమిత్రల ర్యాలీ
శ్రీకాకుళం(టౌన్), జనవరి 22: రాష్టవ్య్రాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవలో పనిచేస్తున్న ఆరోగ్యమిత్రలను తొలగించే దిశగా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం.28ని రద్దుచేయాలని వైద్యమిత్ర ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద ఆందోళన చేసిన అనంతరం నినాదాలు చేస్తూ ర్యాలీగా కలెక్టరేట్ వరకు వెళ్లారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు ఎం.త్రినాథరావు విలేఖర్లతో మాట్లాడుతూ ప్రభుత్వ వైఖరి కారణంగా రాష్టవ్య్రాప్తంగా ఎనిమిదేళ్లుగా పనిచేస్తున్న రెండు వేల మంది ఉద్యోగులు కుటుంబాలతో వీధిన పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకొని ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కె.శారద, ఊర్మిళ, గోవిందరావు, ఉమాశంకర్, తవిటినాయుడు తదితరులు పాల్గొన్నారు.
రోడ్ల మరమ్మతులకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి
శ్రీకాకుళం(టౌన్), జనవరి 22: పట్టణంలోని 33, 34, 36 వార్డు పరిధిలో శాసనసభ్యురాలు గుండ లక్ష్మీదేవి పర్యటించారు. శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆమె నగరపాలక సంస్థ అధికారులతో ఆయా వార్డుల్లోని రోడ్లు, కాలువలు పరిశీలించారు. పాడైన రోడ్ల వివరాలు, ప్రతిపాదనలు తయారు చేయాలని ఈ సందర్భంగా నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. అలాగే 33, 34 వార్డుల్లో ఆక్రమణలను ఆమె పరిశీలించారు. తక్షణమే వాటిపై చర్యలు తీసుకోవాలని, అసలు ఇటువంటి వాటిని ముందస్తుగానే పరిరక్షించాల్సి ఉందన్నారు. దీనిపై అధికారులు ఎందుకు నిర్లిప్తంగా ఉంటున్నారని, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత అధికారులపై లేదా అంటూ మండిపడ్డారు. అలాగే ముందుగా కాలువలు నిర్మించడం ద్వారా పారిశుద్ధ్యమెరుగుకు కృషిచేయాలని, తన నియోజకవర్గంలో స్వచ్ఛ్భారత్ వంద శాతం అమలు కావాలని ఆమె అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో ఆమెతో పాటు జన్మభూమి కమిటీ నేతలు మాదారపు వెంకటేష్, జామి భీమశంకర్, చిట్టి నాగభూషణం, మావూళ్ల శ్రీనివాసరావు, నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీనివాసరావు, ప్రజారోగ్య అధికారి డాక్టర్ దవళ భాస్కరరావు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

‘రాజ్యాంగ వ్యవస్థను భ్రష్టు పట్టించేశారు’
:గార, జనవరి 22: రాజ్యాంగ వ్యవస్థనే భ్రష్టు పట్టించే విధంగా తెలుగుదేశం ప్రభుత్వ పాలన ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ నేత మార్పు ధర్మారావు ఇంటికి పరామర్శకు విచ్చేసిన సందర్భంగా ఆయన నివాసంలో విలేఖర్లతో మాట్లాడారు. అడ్డగోలుగా వ్యవహరిస్తున్న వారిని నిలదీసే అధికారులు, ప్రజల ప్రాణాలు తీసే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వ్యవహరిస్తున్నారంటూ నారాయణమ్మ, వనజాక్షిల పేర్లు ప్రస్తావించారు. ఇసుక మాఫియా రాష్ట్రంలో తారాస్థాయికి చేరుకుందని.. సూత్రధారి కార్మిక మంత్రి అచ్చెన్నాయుడే అంటూ ఆరోపణాస్త్రాలు సంధించారు. ఇసుక విధానాలు కారణంగా నిర్మాణ, కార్మిక రంగాలు కుంటుపడి పోయాయన్నారు. ప్రభుత్వ విధానాలు కలెక్టరు వ్యవస్థనే పచ్చ చొక్కాలుగా మార్చివేసిందన్నారు. కాల్‌మనీ సెక్స్ రాకెట్‌లో ఉన్న వారెవరు.. చట్టాలు వారికి వర్తించవా అంటూ తెలుగుదేశం పార్టీపై దుమ్మెత్తిపోశారు. ల్యాండ్ బ్యాంక్ పేరిట 10లక్షల ఎకరాలు సంపన్న, పెట్టుబడి వర్గాలను ఉద్ధరించడానికా.. అంటూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మంటగలిసిపోయిందన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఇంటికో ఉద్యోగం అన్న ముఖ్యమంత్రి ఉన్న ఉద్యోగాలను పీకేస్తున్నారన్నారు. నిరుద్యోగ యువత భృతి గాలికి వదిలేశారన్నారు. రుణ మాఫీ పేరిట రైతులకు, డ్వాక్రా గ్రూపులకు టోక్రా కొట్టించారని, రైతులు, మహిళలు పరపతి కోల్పోయి బ్యాంకులు వద్ద దోషుల్లా ఉండాల్సిన పరిస్థితి ప్రభుత్వ విధానాలు కల్పించాయన్నారు. పాలనా వ్యవహారం అంతా మాఫియా అడ్డాగా మారిందని, అంతా చిన్నబాబే.. అన్న చందంగా లోకేష్ వ్యవహరిస్తున్నాడన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ శ్రేణులు మార్పు ధర్మారావు, గొండు రఘురాం, పీస శ్రీహరిరావు, ముంజేటి క్రిష్ణమూర్తి, కొయ్యాన నాగభూషణరావు, కైబాడి రాజు, యాళ్ల నారాయణరావు, పుల్లటి శశిభూషణరావు, పుల్లటి నాగేశ్వరరావు, చింతల గడ్డెయ్య తదితరులు ఉన్నారు.
అదనపు పాఠశాల
భవనాలు మంజూరు
వంగర, జనవరి 22: మండలం లోని సంగాం, శివ్వాం, మడ్డువలస గ్రామాల్లో పాఠశాలలకు రాజీవ్ విద్యామిషన్ ద్వారా అదనపు భవనాలు మంజూరయినట్టు డిఇఇ సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం ఆయన ఆయా గ్రామాల్లో పర్యటించి భవన నిర్మాణాలకు స్థలాలను పరిశీలించారు. ఒక్కొక్క భవనానికి రూ.6.50 లక్షలు చొప్పున కేటాయిస్తున్నట్టు తెలిపారు. ఇంజనీర్ రమణ కూడా పాల్గొన్నారు.
మిగిలిపోయిన చంద్రన్న సరుకులు
సారవకోట, జనవరి 22: సంక్రాంతి, క్రిస్మస్ పండుగల సందర్భంగా ప్రభుత్వం చంద్రన్న కానుకల పేరుతో రేషన్ కార్డుదారులకు అందజేయాలని విడుదల చేసిన యూనిట్‌లలో 736 మిగిలిపోయాయి. ఈ సరకులను తక్షణమే మండల పౌరుసరఫరాల గిడ్డంగికి అప్పగించాలని తహశీల్దార్ ఈశ్వరమ్మ చౌక ధరల దుకాణాల డీలర్లకు ఆదేశించారు. జనవరి నెలలో కొత్తగా మంజూరు చేసిన 374 రేషన్‌కార్డులతో 16,069 మంది రేషన్ కార్డు దారులకు చంద్రన్న కానులను ఉచితంగా అందజేయాలని ప్రభుత్వం సంకల్పించింది. అయితే, ఇందులో 736మంది రేషన్ కార్డు దారులు వివిధ కారణాల వలన ఉచిత సరుకులను విడుదల చేయలేదు. కొంతమంది వలసకుటుంబాల వారు స్వగ్రామాలకు తిరిగి రాకపోవడం వంటి కారణాలతో ఈ యూనిట్లు మిగిలిపోయాయి. ఈనెల 17వ తేదీ వరకు సరకులను పంపిణీ చేశామని అప్పటికీ కూడా మిగిలి పోయిన సరకులను మండల గిడ్డంగికి అందజేసి వివరాలు నమోదు చేసుకోవాలని డీలర్లకు తహశీల్దార్ సూచించారు. ఇదిలా ఉండగా దీర్ఘకాలిక రోగాలతో మంచం పట్టిన కార్డు దారులు, వృద్ధులకు సంబంధించి వేలిముద్రలు ఈ పాస్ యంత్రాలపై నమోదు కాని సందర్భాలలో ఐరీస్ యంత్రంద్వారా సరుకులు బట్వాడా చేయడానికి ప్రయత్నించాలని డీలర్లకు సూచించారు. అప్పటికీ కూడా అవకాశం లేకపోతే ఆయా కార్డు దారుల వివరాలను అందజేయాలని స్పష్టంచేశారు.
సంబంధిత గ్రామపరిపాలనాధికారి ఆథరైజేషన్‌తో ఈ కుటుంబాలకు వచ్చే నెలలో నిత్యావసర సరుకులు అందజేయడానికి వీలుగా జిల్లా అధికారులకు ప్రతిపాదనలు పంపించనున్నట్టు తహశీల్దార్ ఈశ్వరమ్మ స్పష్టంచేశారు.