ప్రేమ పావురాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నయనతార ప్రధాన పాత్రలో వాసుకి లాంటి సంచలన సినిమాను అందించిన శ్రీరామ్ సినిమా బ్యానర్‌లో వస్తోన్న రెండో చిత్రం ‘ప్రేమపావురాలు’. గతేడాది తమిళ్‌లో ‘కాదల్ కన్ కట్టుదే’ పేరుతో చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకున్న సినిమా ఇప్పుడు తెలుగులోనూ విడుదలకు సిద్ధమవుతోంది. నిర్మాత శ్రీరామ్ మాట్లాడుతూ- ఫీల్ గుడ్ లవ్‌స్టోరీగా విడుదలై 2017లో ది బెస్ట్ లవ్‌స్టోరీగా తమిళ ప్రేక్షకుల, విమర్శల ప్రశంసలను అందుకున్న చిత్రం ‘కాదల్ కన్ కట్టుదే’. ప్రధాన పాత్రల్లో నటించిన కె.జి.అతుల్యలు ఈ సినిమాతో ఓవర్‌నైట్ స్టార్స్‌గా ఎదిగారు. తెలుగులో ఈ చిత్రాన్ని నేరుగా రీమేక్ చేయాలనుకున్నా, ఒరిజినల్ వెర్షనంత ప్రెష్‌గా నేచురల్‌గా సినిమా ఔట్‌పుట్ రాదని భావించి, డబ్ చేస్తున్నాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దర్శకుడు శివరాజ్.ఆర్ అందించిన కథ, కథనాలతోపాటు లీడ్ యాక్టర్స్ పెర్‌ఫార్మెన్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. పవన్ సంగీతం, ఆర్.ఆర్ మరో ఎసెట్‌గా చెప్పుకోవచ్చు. స్ట్రెయిట్ తెలుగు సినిమా తరహాలోనే క్వాలిటీగా డబ్బింగ్ వర్క్ జరుగుతోంది. సమ్మర్‌లో సినిమాను విడుదల చేస్తామన్నారు.