నీతోనే హాయ్ హాయ్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరుణ్ తేజ్, చరిష్మా శ్రీకర్ జంటగా బి.ఎన్.రెడ్డి అభినయ దర్శకత్వంలో కె.ఎస్.పి ప్రొడక్షన్స్ పతాకంపై డా.ఎస్.కీర్తి, జి.పార్థసారథిరెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘నీతోనే హాయ్ హాయ్’. ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం హైదారాబాద్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ నటుడు శ్రీకాంత్ హీరో హీరోయిన్లపై క్లాప్ కొట్టారు. ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా కెమెరా స్విచ్చాన్ చేయగా, సీనియర్ దర్శకుడు రేలంగి నరసింహారావు గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు బి.ఎన్.రెడ్డి మాట్లాడుతూ- కథను నమ్మి చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు. నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. కథ విషయానికి వస్తే బాగా డబ్బున్న వ్యక్తి వ్యక్తిత్వం ఎలా వుంటుంది, మధ్య తరగతివాడి మనస్తత్వం ఎలా వుంటుంది అన్న పాయింట్‌తో తెరకెక్కిస్తున్నాం. క్యూట్ లవ్‌స్టోరీతోపాటు అన్ని రకాల కమర్షియల్ హంగులు ఉంటాయి. పాటలని విదేశాలలో చిత్రీకరిస్తాం అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ- దర్శకుడు మంచి కథను చెప్పడంతో ఈ సినిమా తీయడానికి ముందుకు వచ్చాం. ఏ విషయంలోనూ వెనకడుగు వేయకుండా తెరకెక్కిస్తాం. రవికళ్యాణ్ కంపోజ్ చేసిన పాటలు చాలా బాగా వచ్చాయి. తప్పకుండా మా తొలి ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నానన్నారు. హీరో అరుణ్‌తేజ్ మాట్లాడుతూ- తమిళంలో ఓ చిత్రం చేశాను. చంద్రుడిలో వుండే కుందేలు తరువాత తెలుగులో చేస్తున్న రెండో చిత్రమిది. తప్పకుండా హీరోగా నాకు గుర్తింపు లభిస్తుంది అన్నారు. హీరోయిన్ చరిష్మా మాట్లాడుతూ- క్యూట్ లవ్‌స్టోరీలో క్యూట్ క్యారెక్టర్ చేస్తున్నందుకు ఆనందంగా వుంది అన్నారు. ఈ చిత్రంలో ఆనంద్, బెనర్జి, ఏడిద శ్రీరాం, జయచందర్, రత్నప్రభ, జబర్దస్త్ రాంప్రసాద్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఈదర ప్రసాద్, సంగీతం: రవి కళ్యాణ్, ఎడిటింగ్: ఆనంద్ పవన్, సమర్పణ: యలమంచిలి ప్రవీణ్, నిర్మాతలు: డా.ఎస్.కీర్తి, డా. జి.పార్థసారథిరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: బి.ఎన్.రెడ్డి అభినయ.