చిన్న సినిమాలకు న్యాయం జరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పీపుల్స్ స్టార్‌గా విప్లవ చిత్రాలతో ఇమేజ్ తెచ్చుకున్న ఆర్.నారాయణమూర్తి తాజాగా నటిస్తున్న చిత్రం ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’. జయసుధ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్నారు. చదలవాడ పద్మావతి నిర్మించిన ఈ చిత్రం నెల 14న విడుదలవుతున్న సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో పాత్రికేయులతో దర్శకుడు చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ, సంక్రాంతి అంటే సినీ పరిశ్రమలో అదో క్రేజ్. ఇప్పటివరకు లేని విధంగా ఈ సంక్రాంతికి సినిమాల మధ్య పోటీ నెలకొంది. కోడిపందాలకన్నా ఎక్కువ ఆసక్తి రేపుతోంది. మా వెంకట్రామయ్య చిత్రం సెన్సార్ పూర్తిచేసుకుని 14న విడుదలకు సిద్ధమైంది అన్నారు. దర్శకుడు అజయ్ మాట్లాడుతూ, దర్శకత్వం కొత్త అయినప్పటికీ చదలవాడ ఎలాంటి టెన్షన్ లేకుండా సినిమా తీశారు. నారాయణమూర్తిని కొత్తగా చూపించారని అన్నారు.
నారాయణమూర్తి మాట్లాడుతూ-‘30 ఏళ్లుగా పరిశ్రమలో ఉన్నాను. తమ గురించి సినిమా తీయండని చాలామంది పోలీసు బ్రదర్స్ అడుగుతున్నారు. ఈ సినిమా వారికోసమే. నాకు పోలీసులమీద ఎలాంటి ద్వేషం లేదు. ఉన్నదంతా సొసైటీ మీదే. ప్రస్తుతం మానవ విలువలను ఆర్థిక విలువలు డామినేట్ చేస్తున్నాయి. ఈ దశలో డబ్బు లేకుండా చేస్తేనే బాగుంటుందనే ఆలోచనతో ఈ చిత్రం రూపొందించారు. గత 15 ఏళ్లుగా ఎలాంటి సక్సెస్‌లు లేకుండా మహాసాగరంలో ఈదుతున్నాను. నాపై ఇంత బడ్జెట్‌తో సినిమా తీయడం ఎందుకని అడిగాను. కానీ సినిమామీద వున్న నమ్మకంతో బాగా ఖర్చుపెట్టి చేశారు. జయసుధతో నటించడం ఆనందంగా వుంది. గొప్ప నటి ఆమె. నా చిత్రం రెండు భారీ చిత్రాల మధ్య విడుదలవడం ఆనందంగా వుంది. ఎవరికి ఎవరూ పోటీకారు. ఎవరి సినిమా వాళ్ళదే. థియేటర్లు దొరకకపోవడం బాధ కలిగిస్తోంది. కొంతమంది థియేటర్లను తమ చేతుల్లో పెట్టుకొని చిన్న సినిమాలకు అన్యాయం చేస్తున్నారు. ఇది నిజంగా దుర్మార్గమైన చర్య. తీసిన ప్రతి తెలుగు సినిమా విడుదలయ్యేలా నిర్మాతల మండలి, ఫిలిం ఛాంబర్, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. పెద్ద సినిమాల కోసం వేల సంఖ్యలో థియేటర్లను బుక్ చేసుకుని చిన్న సినిమాలను విడుదల కాకుండా అన్యాయం చేస్తున్నారు. ఇండస్ట్రీ ఏ ఒక్కరిదీ కాదు. సినిమాలు విడుదలవడం ముఖ్యం. అది హిట్టా? ఫ్లాపా? అనేది ప్రేక్షకులు నిర్ణయిస్తారు. చిన్న సినిమాలు ఆడడానికి ఊరికొక్క థియేటర్ ఇస్తే చాలు. ఇక ఆమధ్య పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో టెంపర్ సినిమాలో ఓ మంచి పాత్ర అవకాశం ఇచ్చారు. కానీ అది నేను కావాలనే చేయలేదు. నేను జూనియర్ ఆర్టిస్టుగా వచ్చినవాణ్ణి. ఆ తరువాత హీరోగామారి సినిమాలు చేస్తున్నాను. మళ్లీ పాత్రల కోసం పరిగెత్తడం భావ్యం కాదనిపించింది. నేను చేస్తే హీరోగానే చేస్తా. అందుకే ఆ సినిమాకు నో చెప్పాను. మరిన్ని మంచి పాత్రలతో సినిమాలు చేయడానికి కొత్త ఊపు వచ్చింది’ అన్నారు.