సైంటి’ ఫిజిక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభాస్‌ను పాన్ వరల్డ్ హీరోగా చూపించేందుకు దర్శకుడు నాగ్ అశ్విన్ రెడీ అవుతోన్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టును ప్రకటించటంతోనే -ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ‘జాన్’ అప్‌డేట్స్‌ని జనాలు పట్టించుకోవడం మానేశారు. ‘ప్రభాశ్విన్’ ప్రాజెక్టు అప్‌డేట్స్‌పైనే ఆసక్తి చూపుతున్నారు. అయితే, ఈ ప్రాజెక్టు నుంచి వినిపిస్తోన్న తాజా ఆసక్తికర కథనమేంటంటే -ప్రభాస్‌కు అనూహ్యమైన కాంబినేషన్‌ను సెట్ చేస్తున్నారని. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంగా సాగే సూపర్ హీరో స్టోరీ కనుక -హీరోకి తగిన చాకులాంటి బాలీవుడ్ బ్యూటీని ఎంపిక చేశారన్న మాట వినిపిస్తోంది. బాలీవుడ్‌లో టాప్ ఇమేజ్‌తోపాటు, అథ్లెటిక్ ఫిట్‌నెస్‌తో కైపెక్కిస్తోన్న కత్రినా కైఫ్‌పట్ల ప్రభాస్ ఆసక్తి చూపిస్తున్నాడన్న కథనాలు లేకపోలేదు. నిజానికి -ప్రభాస్ చేసిన పాన్ ఇండియా సినిమా సాహోలోకి కత్రినానే తీసుకోవాలని అనుకున్నారట. అప్పటికి వరుస ప్రాజెక్టులతో ఆమె బిజీగా ఉండటంతో -చాన్స్ శ్రద్ధాకఫూర్‌కి దక్కింది. అయితే, సాహోలో ప్రభాస్ -శ్రద్ధల మధ్య అనుకున్నంత రొమాంటిక్ కెమిస్ట్రీ ఏంపండలేదు. సాహో రిజల్ట్ సైతం పూర్తిగా నిరాశపర్చింది. ఇదిలావుంటే, బాలీవుడ్‌లో ప్రస్తుతం కత్రినా అంత బిజీగా లేదు. వరుస ఆఫర్స్ వస్తున్నా.. సెలెక్టెడ్‌గానే సినిమాలు చేస్తోంది. సో, సైన్స్ ఫిక్షన్ స్టోరీ, ప్రభాస్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈసారి ఓకే చెప్పొచ్చన్న మాట వినిపిస్తోంది. ప్రభాస్ ప్రతిపాదన దర్శకుడు నాగ్‌అశ్విన్‌కూ నచ్చటంతో, కత్రినాను ఇప్పటికే కాంటాక్ట్ చేశారట. ప్రభాస్ -కత్రినా పెయిర్ కథకు పర్ఫెక్ట్ మ్యాచ్ అన్న భావన నాగ్‌అశ్విన్ నుంచీ వ్యక్తమవుతున్నట్టు సమాచారం. సూపర్ హీరో సరసన సైంటి‘ ఫిజిక్ అప్పియరెన్స్‌కు ఆమె అథ్లెటిక్ షేప్స్ అద్భుతంగా సెట్టవుతాయన్న డిజైన్‌తో ఉన్నట్టు తెలుస్తోంది. స్పైడర్‌మ్యాన్, సూపర్‌మ్యాన్, యాంట్‌మ్యాన్ మాదిరి సూపర్ హీరో క్యారెక్టర్ క్రియేట్ చేసి -వర్కౌటైతే హాలీవుడ్ స్టయిల్లో అదే క్యారెక్టర్‌తో సిరీస్‌ని ప్లాన్ చేయాలన్నది దర్శకుడి ఆలోచనగా కనిపిస్తోంది. సో, సాహోలో మిస్సైన కత్రినా -సైన్స్‌ఫిక్షన్ స్టోరీలో కనిపించటం దాదాపు ఖాయమైనట్టే అంటున్నారు.