శంభో శంకర టైటిల్ నచ్చింది -- హీరో విశాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంకర్‌ని హీరోగా, శ్రీ్ధర్ ఎన్.దర్శకుడిగా పరిచయంచేస్తూ ఆర్.ఆర్.పిక్చర్స్ సంస్థ, ఎస్.కె.పిక్చర్స్ సమర్పణలో వై.రమణారెడ్డి, సురేష్ కొండేటి సంయుక్తంగా నిర్మిస్తోన్న ‘శంభోశంకర’ చిత్రం రెండవ లిరికల్ వీడియో పాటను హీరో విశాల్ విడుదలచేసారు. భాస్కరభట్ల రాసిన ఈ పాట గురించి హీరో విశాల్ మాట్లాడుతూ.. ‘నాకు మొట్టమొదటగా ‘శంభో శంకర’ టైటిల్ బాగానచ్చింది. మీ సినిమా టైటిల్ అయితే నిజంగానే అదిరింది. శంకర్ నటించిన రెండు, మూడు సినిమాలు చూశాను. అప్పటికీ ఇప్పటికీ చాలా డిఫరెంట్ అనిపించింది. ఈ పాట చాలా అద్భుతంగా ఉంది. సాయికార్తిక్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా గ్యారెంటీగా పెద్దహిట్ అవుతుంది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు. చిత్ర కథానాయకుడు శంకర్ మాట్లాడుతూ.. ‘పందెంకోడి’ సినిమా దగ్గర నుంచి విశాల్‌గారు చేసిన చాలా సినిమాలు చూసాను. మంచి నటులు. ఆయన చేతులమీదుగా మా సినిమా పాట విడుదల అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేకంగా విశాల్ గారికి కృతజ్ఞతలు అని అన్నారు. చిత్ర దర్శకుడు శ్రీ్ధర్ ఎన్. మాట్లాడుతూ, ‘సాయి కార్తిక్ అన్ని పాటలకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. తొలి పాటను వి.వి.వినాయక్‌గారు చేతులమీదుగా విడుదలచేసాం. ఇప్పుడు రెండవ పాటకు సంబంధించిన లిరికల్ వీడియోసాంగ్‌ను విశాల్‌గారు విడుదలచేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది హీరో ఇంట్రడక్షన్ సాంగ్‌లా వస్తుంది. ఎంతో భారీగా భానుమాస్టర్ నృత్య దర్శకత్వంలో 4 రోజులపాటు చిత్రీకరించాం’అని అన్నారు. చిత్ర నిర్మాతలలో ఒకరైన వై.రమణారెడ్డి మాట్లాడుతూ.. షూటింగ్‌తోపాటు, డబ్బింగ్ కార్యక్రమాలుకూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం రీరికార్డింగ్ పనులు జరుగుతున్నాయి. ఓ మంచి హిట్ సినిమాను ప్రేక్షకులకు అందించబోతున్నాం. టీమ్ అంతా రేయింబవళ్లు ఆరునెలలపాటు కష్టపడి చేసిన సినిమా ఇది అని అన్నారు. మరో నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ-‘ముందుగా రెండవ పాటను విడుదల చేసిన విశాల్‌గారికి థాంక్స్. నా ప్రియమిత్రుడు భాస్కరభట్ల ఈ పాటను ఎంతో అద్భుతంగా రాసారు. ఇక సాయి కార్తిక్ మ్యూజిక్ అద్భుతం. జూన్ మొదటివారంలో టీజర్‌ను విడుదల చేయబోతున్నాం. జూన్ 10వ తేదీకల్లా ఫస్ట్ కాపీ రెడీ చేసి వెంటనే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకుని జూన్ మూడోవారంలో సినిమా విడుదల చేయబోతున్నాం. బిజినెస్‌పరంగా మంచి ఎంకరేజ్‌మెంట్ ఉంది. ఈ సినిమాకు సంబంధించిన హిందీ రైట్స్ అరకోటికి పైగా పోటీపడి ఆదిత్య భాటియా సొంతం చేసుకున్నారు. అలాగే అన్ని ఏరియాల నుంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఈ సినిమా రికార్డుస్థాయిలో బిజినెస్ మరియు కలెక్షన్ల వర్షంకూడా కురిపించే చిత్రంగా ఈ ‘శంభోశంకర’నిలుస్తుంది అని అన్నారు. ఇందులో శంకర్ సరసన కారుణ్య నాయికగా నటించింది. నాగినీడు, అజయ్‌ఘోష్, రవి శంకర్, ప్రభు, ఏడిద శ్రీరామ్ నటించారు. ఈ చిత్రానికి మాటలు: భవానీ ప్రసాద్, కెమెరా: రాజశేఖర్, సంగీతం: సాయికార్తిక్, ఎడిటింగ్: ఛోటా.కె.ప్రసాద్, నిర్మాతలు: వై.రమణారెడ్డి, సురేష్ కొండేటి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీ్ధర్.ఎన్.