పడిపడి నవ్వడమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌తరుణ్, మాళవిక నాయర్ హీరో హీరోయిన్లుగా లక్ష్మీరాధామోహన్ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై విజయకుమార్ కొండ దర్శకత్వంలో కెకె రాధామోహన్ నిర్మిస్తోన్న యూత్ ఎంటర్‌టైనర్ -ఒరేయ్ బుజ్జిగా. టీజర్, పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో కరీంనగర్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. మేయర్ సునీర్‌రావు ముఖ్య అతిధిగా హాజరై ఆడియో, బిగ్ సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మాత రాధామోహన్ మాట్లాడుతూ -ఒరేయ్ బుజ్జిగా ఫుల్‌లెంగ్త్ ఎంటర్‌టైనర్. చక్కని టీం ఎఫర్ట్‌తో సినిమా అద్భుతంగా వచ్చింది. సినిమాను మార్చి 25న విడుదల చేద్దామనుకున్నా, కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వ నిర్ణయంతో థియేటర్లు తాత్కాలికంగా మూతపడిన నేపథ్యంలో విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం అన్నారు. హీరో రాజ్‌తరుణ్ మాట్లాడుతూ -్థయేటర్‌కు వచ్చే ఫ్యామిలీ మొత్తం రెండు గంటలు పడిపడి నవ్వుకునే సినిమా అన్నారు. చిత్ర దర్శకుడు విజయ్‌కుమార్ కొండ మాట్లాడుతూ -ఒరేయ్ బుజ్జిగా చిత్రంలో రెండు గంటలు ఆడియన్స్‌ని నవ్వించాలనే తీశాం. ఫైనల్ అవుట్‌పుట్ బాగా వచ్చింది. ఆర్టిస్టులు, టెక్నికల్ టీం కృషి, నిర్మాత రాధామోహన్ సపోర్ట్‌తో మంచి అవుట్‌పుట్ తీశాం. ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తుందనే అనుకుంటున్నా అన్నారు. కార్యక్రమంలో సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, సింగల్ రాహుల్ సిప్లిగంజ్, నటుడు మధుసూధన్, దితరులు మాట్లాడారు. చిత్రంలో హెబ్బాపటేల్ కీలక పాత్ర చేస్తుంటే, వాణీవిశ్వనాథ్, నరేష్, పోసాని కృష్ణమురళి, అనీష్ కురువిల్లా తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.