పాటల్లో ఆర్ యూ మ్యారీడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వౌర్య, చరిష్మా శ్రీకర్, వెంకటరాజ్, అవంతిక ముఖ్యపాత్రల్లో సెవెన్ హిల్స్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై అళహరి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్ యూ మ్యారీడ్’. జయసూర్య సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు సోమవారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. నిర్మాత మల్కాపురం శివకుమార్ సీడీని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ- మంచి కానె్సప్టుతో తెరకెక్కిన చిత్రమిది. అళహరి దర్శకుడిగా, అటు నిర్మాతగా రెండు బాధ్యతల్ని సమన్వయం చేశారు. జయసూర్య అందించిన పాటలు బాగున్నాయి. టీజర్ కూడా ఆకట్టుకుంది. తప్పకుండా ఈ సినిమా మంచి విజయం సాధించి యూనిట్‌కు మంచి లాభాలు తేవాలని కోరుకుంటున్నానన్నారు. దర్శక నిర్మాత అళహరి మాట్లాడుతూ- అనూహ్యమైన రీతిలో ఊహించని ట్విస్టులతో సాగే థ్రిల్లర్ సినిమా ఇది. నన్ను, నా కథను నమ్మి నాకు సపోర్టు చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రం ఉంటుంది. షూటింగ్ పూర్తయింది. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శాంతిరెడ్డి, శ్రీప్రియ, మేకా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.