అభిమన్యుడి విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాల్, సమంత జంటగా పి.ఎస్.మిత్రన్ దర్శకత్వంలో విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ, హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై గుజ్జలపూడి హరి నిర్మించిన ‘అభిమన్యుడు’ చిత్రం ఇటీవలే విడుదలై సంచలన విజయం అందుకుంది. ప్రస్తుతం భారీ వసూళ్ళతో దూసుకుపోతున్న సందర్భంగా నిర్మాత హరి గుజ్జలపూడి వివరాలు తెలియజేస్తూ- జూన్ 1న విడుదలైన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో అనూహ్యమైన విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా రెండు రాష్ట్రాల్లో భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. కేవలం మూడు రోజుల్లో 7.10 కోట్ల రూపాయలను వసూలు చేసి విశాల్ కెరీర్‌లోనే పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకోసం విశాల్ ఎంతగానో సపోర్టు అందించారు. డిజిటల్ ఇండియా నేపథ్యంలో సామాన్య ప్రేక్షకుడు ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నాడు, సైబర్ క్రైమ్‌లు ఎలా జరుగుతున్నాయనే అంశంతో ఈ చిత్రాన్ని దర్శకుడు మిత్రన్ అద్భుతంగా తెరకెక్కించాడు. సామాజిక బాధ్యత పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న విశాల్, సినిమాలతో కూడా ప్రేక్షకులకు అనేక సందేశాలను అందిస్తున్నాడు. 600 థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం నేటినుండి మరో 60 థియేటర్లకు పెంచనున్నాం. వరుస విజయాలతో దూసుకుపోతున్న సమంత మరోసారి తన విజయాన్ని కంటిన్యూ చేశారు. తమిళంలో కూడా ఘనవిజయం సాధించిన ఈ చిత్రంపై పెట్టుకున్న నమ్మకాన్ని ప్రేక్షకులు నిజం చేసినందుకు ఆనందంగా ఉంది. మా హరి వెంకటేశ్వర బ్యానర్‌పై మంచి చిత్రాలను అందించాలనే ఉద్దేశ్యంతో ఉన్నాను. వరుసగా విశాల్ సినిమాలు చేయడం ఆనందంగా ఉంది. పందెంకో తరువాత దానికి సీక్వెల్‌గా వస్తున్న సినిమా కూడా మా బ్యానర్‌లోనే ఉంటుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. దసరాకు విడుదల చేస్తామన్నారు.