8న బెస్ట్ లవర్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకరణ్, అమృత, నిషా, దివ్య, ప్రీతి నాయకా నాయికలుగా శ్రీ కిరణ్ ప్రొడక్షన్స్ పతాకంపై నంది వెంకటరెడ్డి దర్శకత్వంలో శ్రీకాంత్ గొంటి నిర్మిస్తున్న చిత్రం ‘బెస్ట్ లవర్స్’. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకు సోమవారం ఉదయం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో జరిగింది. ఈ సందర్భంగా చిత్ర హీరో శ్రీకరణ్ మాట్లాడుతూ- సోషల్ మీడియా నేపథ్యంలో సాగే అందమైన లవ్‌స్టోరీ ఇది. ఒకర్ని ఒకరు చూసుకోకుండానే ప్రేమించుకుంటారు. ఆ ప్రేమను ఓ సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలతో చిత్రీకరించాం. పాటలు, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా కూడా పెద్ద విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది అన్నారు. చిత్ర దర్శకుడు నంది వెంకటరెడ్డి మాట్లాడుతూ- విజయవాడ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి మధ్య జరిగిన నిజమైన కథను సినిమాగా చేస్తున్నాం. ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఆ ప్రేమ ఎలా సాగింది? ఎలాంటి పరిణామాలకు దారితీసింది అన్న అంశాలు హైలెట్‌గా ఉంటాయి. ఈ నెల 8న సినిమా రిలీజ్ అవుతోంది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది అన్నారు. చిత్ర నిర్మాత శ్రీకాంత్ గొంటి మాట్లాడుతూ- చాలా రోజుల తర్వాత మంచి ఫీల్ దొరికే లవ్‌స్టోరీ చేశానని నమ్మకంగా ఉన్నాను. దర్శకుడు ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా చిత్రీకరించారు. తప్పకుండా ఆదరిస్తారన్న నమ్మకం ఉంది అన్నారు. ఈ నెల 8న విడుదల కాబోయే బెస్ట్‌లవర్స్ చిత్రం ప్రమోషనల్ పోస్టర్స్‌ను సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌గారి స్వగృహంలో లాంఛ్ చేశారు. మంత్రిగారు ఈ సందర్భంగా శుభకాంక్షలు తెలిపి అభినందించారు. ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి సత్యనారాయణ, అట్లూరి రామకృష్ణ, సాయి వెంకట్ తదితరులు ప్రసంగించారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం:డి.యాదగరి, సంగీతం:సాయికిరణ్, పాటలు:ప్రశాంత్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్:జయంత్, నృత్యం:నందు జెనన్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:నంది వెంకటరెడ్డి, నిర్మాత:శ్రీకాంత్ గొంటి.