చినబాబు టీజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరో కార్తీ నటించిన చినబాబు టీజర్‌ను కార్తీ అన్న హీరో సూర్య విడుదల చెయ్యడం జరిగింది. టీజర్‌కు అన్ని వర్గాల ప్రేక్షకులనుండి అద్భుతమైన స్పందన లభిస్తోంది. రైతు పాత్రలో కార్తీ కనిపించబోతున్నాడు. గ్రామీణ నేపథ్యంలో జరిగే ఒక రైతు గురించి సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. చినబాబు టీజర్‌లో కార్తీ డైలాగు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ‘పుట్టించినవాడు దేవుడైతే.. పండించినవాడు కూడా దేవుడే’, ‘నువ్వే రైతు అయితే కాలర్ ఎగరేసుకొని తిరుగు’ అంటూ రైతుల గొప్పదనం గురించి దర్శకుడు పాండిరాజ్ రాసిన డైలాగ్స్‌కు మంచి స్పందన లభిస్తోంది. నటుడు సత్యరాజ్ ఈ సినిమాలో ముఖ్యపాత్రలో కనిపించబోతున్నాడు. డి.ఇమాన్ సంగీతం అందిస్తున్న చినబాబు సినిమాను తమిళ స్టార్ హీరో సూర్యతో కలిసి నిర్మాత మిరియాల రవిందర్‌రెడ్డి ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.